హోం శాఖ మంత్రి ఇలాకాలోనే మహిళలకు రక్షణ కరువు!
హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గం ప్రతిపాడులో మహిళలకు రక్షణ గాల్లో దీపమైంది. రక్షించాల్సిన ప్రజాప్రతినిధులే.. మహిళల ఆత్మగౌరవాన్ని భక్షిస్తున్నారు. ఈ ఏడాది వినాయకుని నిమర్జన వేడుకల్లో మంత్రి నియోజకవర్గ పరిధిలోని పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలోని టీడీపీ మాజీ జడ్పీటీసీ బత్తిన శారద ఇంటి పై దాడిచేసి బీభీత్సం సృష్టించింది అధికార వైసీపీ. ఇదిలా ఉంటే ప్రత్తిపాడు మండలం కొత్తమల్లాయపాలెం వైసీపీ సర్పంచ్ కందూరి లక్ష్మారెడ్డి మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం స్థానిక సచివాలంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. ఈ నేపథ్యంలో డ్వాక్రా యానిమేటర్ల అవినీతిపై కొందరు చర్చను లేవనెత్తారు. అవినీతి యానిమేటర్లును తొలగిచాలని కొందరు సర్పంచ్ ను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్ లక్ష్మారెడ్డి .. యానిమేటర్లు మాకు ఓటు బ్యాంకును తీసుకొచ్చేవారు .. వారిని తొలగించడం కుదరదు.. డ్వాక్రా మహిళలే ఒళ్లు బరువెక్కి కొట్టుకుంటున్నారు .. వారే బ్యాంకులకు వెళ్లి డబ్బులు వేయకుండా యానిమేటర్లును వాడుకుంటున్నారు… యానిమేటర్ల అవినీతికి పాల్పడినా.. వారిని మేం సపోర్ట్ చేస్తాం… వారిపై చర్యలనేవేమి ఉండవు .. అంటూ సమాధానమిచ్చారు. అలా డ్వాక్రా మహిళలందర్ని పట్టుకుని నోటికొచ్చిన బూతులు మాట్లాడంతో సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు నోటిపై వేలేకున్నారు.











