కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనుల వేగం చూసి జనాల్లో హైప్ వచ్చేసింది. మొన్నటికి మొన్న 2 రోజుల వ్యవధిలో వెలిగొండ, పోలవరం LMC ప్రాజెక్టుల తొలి దశ విజయవంతంగా పూర్తి కావడంతో, సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ క్రేజ్ కూడా పీక్స్‌కి వెళ్లిపోయింది. ఒకవైపు లోకేష్ తనదైన దూకుడుతో కొత్త పెట్టుబడులను ఏపీకి తీసుకువస్తూ సంచలనాలు సృష్టిస్తుంటే, మరోవైపు ఆయన ఇమేజ్ ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. ఈ పరిణామాలను చూసి ఓర్వలేకపోయిన వైఎస్ జగన్ అండ్ కో, ఎలాగైనా ఆ సక్సెస్‌కు బ్రేక్ వేయాలని కుట్రలకు తెరలేపింది. లోకేష్ పాపులారిటీని దెబ్బకొట్టడమే టార్గెట్‌గా పెట్టుకుని, సరిగ్గా పోలవరం LMC ప్రారంభించిన మరుసటి రోజే DSC అంశంపై ఫేక్ నరేటివ్స్తో సోషల్ మీడియాలో పక్కా ప్లాన్ ప్రకారం దుష్ప్రచారం మొదలుపెట్టారు.
ఈ అటాక్ వెనుక టైమింగ్ చాలా స్పష్టంగా ప్లాన్ చేసుకున్నారు. పోలవరం LMC ఓపెనింగ్‌తో ప్రజల్లో కూటమి సర్కార్‌పై నమ్మకం అమాంతం పెరిగింది, పైగా లోకేష్ తీసుకువస్తున్న ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో యువతలో ఆయనపై ఫుల్ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయిన జగన్..సడన్‌గా DSC అంశాన్ని అడ్డం పెట్టుకుని నిరుద్యోగులను రెచ్చగొట్టాలని చూశాడు. లోకేష్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనే ఒక్కటే ఉద్దేశంతో ఈ ఫేక్ ప్రచారాన్ని బరిలోకి దించారు. ప్రభుత్వ అభివృద్ధి జోరును ఎలాగైనా పక్కదారి పట్టించాలన్నదే వారి అసలు ఉద్దేశం.
కానీ, ఈసారి జగన్ వేసిన రాజకీయ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. ఫేక్ న్యూస్‌తో లోకేష్‌ను కార్నర్ చేయాలని చూసినా, గ్రౌండ్లో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను తిప్పికొట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం, సమర్థులైన అధికారులు వెంటనే రంగంలోకి దిగి అసలు నిజాలు బయటపెట్టారు. DSC ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేయడంతో, వైసీపీ ఆరోపణలన్నీ గాలిలో కలిసిపోయాయి. ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా బురదజల్లే రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు.
ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్ పూర్తిగా బోల్తా పడ్డారనే చెప్పాలి. ఇవాళ జనాలు చాలా స్మార్ట్ అయ్యారు, ఏది నిజం ఏది అబద్ధం అనేది స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. ఒకవైపు ప్రాజెక్టులు పూర్తవుతుంటే, మరోవైపు ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో పబ్బం గడుపుకోవాలని చూసిన జగన్ ఉన్న కొద్దోగొప్పో విశ్వసనీయతను కూడా కోల్పోయారు. రాజకీయ లబ్ది కోసం నిరుద్యోగ అంశాన్ని వాడుకోవాలని చూసి, ఫైనల్‌గా ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడ్డారు. మొత్తానికి చూస్తే, నారా లోకేష్ ఇమేజ్ను డౌన్ చేయాలని చూసిన జగన్ ఈ గేమ్‌లో దారుణంగా ఓడిపోయారు.











