యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సమ్మర్ లోనే ఈ సినమా స్టార్ట్ చేయాలి అనుకున్నారు అయితే.. కరోనా కారణంగా కుదరలేదు. దీంతో త్రివిక్రమ్ వేరే హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. మహష్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
ఆతర్వాత రామ్ తో సినిమా చేయనున్నట్టు టాక్ వినిపించింది కానీ.. ఎన్టీఆర్ మార్చి నుంచి డేట్స్ ఇస్తానని చెప్పడంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికే ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఒకే చెప్పినప్పటికీ.. టాప్ డైరెక్టర్స్ అండ్ యంగ్ డైరెక్టర్స్ కథలు వింటున్నారట.
రీసెంట్ గా విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన శైలేష్ కొలను ఎన్టీఆర్ కి కథ చెప్పారని తెలుస్తోంది.. శైలేష్ ప్రస్తుతం హిట్ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అలాగే హిట్ సీక్వెల్ స్టోరీ కూడా రెడీ చేసారు. హిట్ సీక్వెల్ లో అడవి శేష్ నటిస్తుండడం విశేషం. అయితే.. శైలేష్ దగ్గర ఎన్టీఆర్ కి కరెక్ట్ గా సరిపోయే స్టోరీ ఉందని తెలిసి.. దిల్ రాజు మీటింగ్ ఏర్పాటు చేసారని తెలిసింది.
శైలేష్ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందట. ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని చెప్పారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శైలేష్ హిట్ రీమేక్ అండ్ హిట్ సీక్వెల్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ మరి కొంత మంది యంగ్ డైరెక్టర్స్ అండ్ టాప్ డైరెక్టర్స్ చెప్పే కథలు వినే ప్లానింగ్ లో ఉన్నారట. మరి.. శైలేష్ ఫుల్ స్ర్కిప్ట్ తో ఎన్టీఆర్ ని మెప్పిస్తే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.
Must Read ;- ఎన్టీఆర్ కు జోడీగా కీర్తి సురేష్ వైపే త్రివిక్రమ్ మొగ్గు