‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ క్విజ్ షో.. స్టార్ మా లో రెండు సీజన్లలో ప్రసారమైంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునల హోస్టింగ్ తో విజయవంతంగా ప్రసారమైన ఈ షో .. ఆ తర్వాత బిగ్ బాస్ ఆగమనంతో వెనుకబడింది. ఈ రెండింటినీ స్టార్ మానే నిర్వహించేది.. అయితే ‘బిగ్ బాస్’ షో 4 సీజన్లలో బ్రహ్మాండమైన టీఆర్పీ రేటింగ్ తెచ్చుకోవడంతో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడీ షో .. జెమినీ టీవీ వారు నిర్వహించబోతున్నట్టు అధికారికమైన వార్త , దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. టైటిల్ ను ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గా చిన్నపాటి మార్పు చేసి.. త్వరలోనే ప్రసారం చేయబోతోంది.
అయితే ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ఒక సూపర్ అప్టేడ్ .. సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ షోకి యంగ్ టైగర్ యన్టీఆర్ హెస్టింగ్ చేయబోతున్నాడట. దానికి పెద్ద మొత్తంలోనే అతడు పారితోషికం అందుకోబోతున్నాడట. గతంలో బిగ్ బాస్ సీజన్ 1 హోస్టింగ్ ఓ రేంజ్ లో నిర్వహించిన యన్టీఆర్ .. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోని సమర్ధవంతంగా నిర్వహిస్తాడనే నమ్మకంతో ఉన్నారట షో నిర్వాహకులు. ఈ షోకి వచ్చిన పారితోషికం తోనే తారక్ లాంబోర్గిని ఉరుస్ కాస్ట్లీ కార్ కొంటున్నాడన్న టాక్ కొద్దిరోజుల నుంచి విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. అయితే యన్టీాఆర్ హోస్టింగ్ గురించి జెమినీ టీవీ వారు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ దీనికి సంబంధించిన ప్రోమోను మాత్రం విడుదల చేశారు. మరి ఈ షో టీఆర్పీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
Must Read ;- యంగ్ టైగర్ కాస్ట్లీ కార్ చూతము రారండీ!