ట్రెండ్ ఫాలో అవ్వడం వేరు.. ట్రెండ్ సృష్టించడం వేరు.. ఇందులో రెండో రకానికి చెందుతారు ఆవుల భార్గవి. అందరి ఆడపిల్లలానే పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టింది. పెళ్లి, పిల్లలు, భర్త.. ఇదేనా జీవితం అనుకుంది. కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుని, తల్లి సాయంతో యూట్యూబ్ లో వంటల ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. మిగతా వారిలా కాకుండా.. అమ్మ చేతి వంట.. అంటూ సొంతింటి రుచులను పరిచయం చేసింది. ఇంకేముంది.. యూట్యూబ్ లక్షల్లో హిట్స్ వస్తున్నాయి. కొంచెం టెక్నాలజీ తెలిసినవాళ్లు ఎవరైనా సరే భార్గవిని ఇట్టే గుర్తు పట్టేస్తారు.
అమ్మ చేతి వంట
భార్గవిది మధ్య తరగతి కుటుంబం. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి. బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది. తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. దీంతో భార్గవి విశాఖపట్నానికి షిఫ్ట్ అయ్యింది. రోజులు గడిచాయి. ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయారు. అయితే భార్గవి ఓ సారి పుట్టిల్లు అయిన రాజమండ్రికి వెళ్లారు. జీవితం చాలా రొటీన్ గా ఉందని తల్లితో చెప్పింది. అప్పుడు తల్లి గీత.. ఇంట్లో మనం చేసే వంటలను వీడియోలు తీసి.. యూట్యూబ్ లో పెట్టొచ్చు కదా ఐడియా ఇచ్చింది. మరో ఆలోచన లేకుండా భార్గవి వెంటనే రంగంలోకి దిగింది. ‘అమ్మచేతి’ వంట అని యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టింది. అయితే ఆమెకు టెక్నాలజీ పట్టు లేకపోవడంతో వీడియోలకు ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. మిత్రుల సలహాలతో వీడియోలను ఎలా ట్రెండింగ్ చేయాలో తెలుసుకుంది. ఆ తర్వాత మంచి వ్యూస్ రావడంతో లెక్కకు మించి వీడియోలు అప్ లోడ్ చేసింది. కొన్ని నెలల్లోనే లక్షల్లో సబ్ స్రైబర్స్ వచ్చి చేరారు. మరో ఆలోచన లేకుండా ‘మనలో మాట’ అని మరో ఛానల్ ను కూడా ప్రారంభించింది.
విభిన్న రుచులు
చిరుతిళ్లూ, కేకులు, చాకెట్లు, బిస్కెట్లు, పిండి వంటలు, చల్లని పదార్థాలు, పచ్చడి, పానీపూరి, భిన్న మైన నాన్ వెజ్ వంటకాల వీడియోలు పోస్ట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరొచ్చింది. ‘అమ్మ చేతి వంట’ను దాదాపు 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు. వ్యూయర్స్ కూడా ఆ వంటకాలను.. ఇంట్లో తయారు చేసుకుంటూ ఆనందపడిపోతున్నారు. ఇంత తక్కువ కాలంలో.. లక్షల హిట్స్ ఎలా వస్తున్నాయని భార్గవిని ప్రశ్నించగా.. డిఫరంట్ గా ట్రై చేస్తే.. ఏదైనా సాధించవచ్చని అంటారు.
Must Read ;- ఆహా ఏమి అతిథ్యం : బంగారు పళ్లెంలో విందు.. ముత్యాల హారాలు గిఫ్ట్!