2019లో దారుణ హ*త్యకు గురైన మాజీ మంత్రి, జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి సీఎం చంద్రబాబును కలవడం.. తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు పుట్టి్స్తోంది. సునీత తన భర్తతో పాటు మంగళవారం సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తన తండ్రి కేసు విషయం గురించి చర్చించేందుకు చంద్రబాబును కలిశారు. వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఇచ్చిన మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌తోపాటు తమపై పోలీసులు పెట్టిన అక్రమ కేసుల గురించి కూడా వారు చంద్రబాబుకు వివరించారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, రాంసింగ్‌పై కేసు తదితర అంశాలపై సీఐడీ విచారణ జరిపించాలని కోరారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. వారి వినతిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
తనకు అన్ని విషయాలూ తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షల డొనేషన్ కూడా సునీత దంపతులు అందించారు. ఇదే సందర్భంలో అక్టోబరు 3, 5 తేదీల్లో అంటువ్యాధుల నివారణ – నియంత్రణపై హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే జి-స్పార్క్-2024 సదస్సుకు రావలసిందిగా సునీత చంద్రబాబును ఆహ్వానించారు.
ఇలా సునీత దంపతులు తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసు గురించి చంద్రబాబును కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య జరగ్గా.. దాన్ని స్వయంగా జగన్ తన కనుసన్నల్లోనే చేయించారని.. తద్వారా కొద్ది నెలల్లో వచ్చిన ఎన్నికల్లో జనాల్లో సానుభూతి పొంది విపరీతమైన జనాదరణ సంపాదించుకున్నారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడు సీఎం అయిన జగన్.. తన బాబాయి హత్య కేసును మాత్రం పట్టించుకోవడమే మానేశారు. కుమార్తె సునీత ఎంతో న్యాయపోరాటం చేసినా కూడా ఆమెకు అడ్డంకులు క్రియేట్ చేయడం, ఎదురు కేసులు పెట్టించడం లాంటివి చేశారు. కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అధికారులు స్పష్టమైన ఆధారాలు సంపాదించినప్పటికీ ఆయన్ను అరెస్టు చేయకుండా జగన్ రెడ్డి సీఎంగా ఉండగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో జగన్ రెడ్డికి ఏ పవర్ లేకుండా పోయింది. అందుకే తన తండ్రి కోసం న్యాయపోరాటం చేస్తున్న సునీతా రెడ్డి కేసులో పురోగతి రప్పించడం కోసం ఇప్పుడు చంద్రబాబును కలిశారు. ఇది జగన్ లో వణుకు పుట్టిస్తుందని సమాచారం. అసలు వారు ఏం చర్చించుకున్నారు? కేసులో ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారనే విషయాలను భారతి రెడ్డి ఆరా తీయించినట్లుగా తెలుస్తోంది. అయితే, చంద్రబాబు ప్రభుత్వంలో వివేకా హత్య కేసులో అసలు నిందితులు, దాని వెనక ఉన్నవారు అందరూ బయటికి వస్తారని, వారికి కారాగారవాసం తప్పదని అంటున్నారు.