అప్పుల కోసం ఇప్పటికే కాళ్లరిగిపోయేలా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న సీఎం జగన్ మళ్లీ ఢిల్లీ వెళ్ల బోతున్నారు. ఆరో తేదీన ఢిల్లీ రావాలని కేంద్రం కబురంపింది. అయితే ఈ సారి సీఎం జగన్ ఢిల్లీ టూర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ పర్యటనలో ఢిల్లీలో సీఎం జగన్ ప్రధాని మోడీ, కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రధానిని , హోం మంత్రిని కలవటం రొటీనే అయినప్పటికీ చంద్రబాబు అరెస్టయ్యాక మాత్రం ఆయన ఈ ఇద్దరినీ కలవటం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో పాటు వచ్చే వారంలో ఎన్నికల నోటిషికేషన్ రావచ్చన్న సంకేతాల నడుమ సాగుతున్న జగన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో ముందస్తు వస్తోందన్న వార్తలు బలంగా వినిపిస్తున్న వేళ ఢిల్లీ వెళుతున్న సీఎం జగన్ కేంద్రం పెద్దలతో ఏం చెబుతారోనన్న ఆసక్తి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ సారి ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న హడావుడి చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. వైసీపీ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కాన్ఫిడెన్స్‌గా ఉన్నప్పటికీ కేంద్రం నిర్ణయం ఎటువైపు ఉంటుందోనన్న ఉత్కంఠమాత్రం ఆ పార్టీలో లేకపోలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలన్న ఆలోచనలో వైసీపీలేకపోవడంతో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.
దీంతో పాటు చంద్రబాబు అరెస్టయ్యాక తొలి సారి ఢిల్లీ వెళుతున్న సీఎం జగన్ కేంద్రానికి ఏం చెబుతారోనన్న
ఆసక్తి అందరిలోనూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలుకూడా కేంద్రం ఇప్పటికే కేంద్రం ఆరా తీసింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ బలం పెరిగిందా? జగన్ నిర్ణయాలతో విసిగిపోయి పార్టీని వీడాలనుకుంటున్న నేతలెవరు వంటి పరిణామాలను కూడా ఈ పర్యటనలో కేంద్రం పెద్దలకు జగన్ వివరించాల్సి ఉంటుంది. అందుకోసం ఓ సమగ్ర నివేదికను కూడా జగన్ సిద్ధం చేసుకుని ఢిల్లీ బయల్దేరబోతునట్టుతెలుస్తోంది.
వీటన్నటికీ తోడు ఎప్పటిలాగే అప్పులు తీర్చేందుకు కేంద్రం సాయం మరో సారి కోరబోతున్నారు సీఎం జగన్. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి జగన్ కేంద్రానికి వివరిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు బాండ్ల వేలం ద్వారా నిధులు సమకూర్చుకుని సర్దుబాట్లు చేసుకుంటున్నప్పటికీ ఈ ఏడాది చివరికల్లా భారీగా వేల కోట్ల రూపాయలు బకాయిలు తీర్చాలంటే కేంద్రం సాయం అవసరమన్న ఆలోచనతో కేంద్రం ముందు జగన్ ఈ సారి పెద్ద పెద్ద ప్రతిపాదనలే పెట్టబోతున్నారట.