నాలుగేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ను కమ్మిన జగన్మాయ వీడిపోతోంది..వైసిపి మబ్బుతెరలు తొలిగి పోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని తేలిపోయాయి..అతను చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదని, చేసింది చెప్పడని, చెప్పింది చెయ్యడనేది అర్ధమైపోయింది. జగన్మోసానికి తాము బలయ్యామనే భావన రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా నెలకొంది..
వైసిపి గుండాల హింసా విధ్వంసాలతో అన్నివర్గాల ప్రజలు బెంబేలెత్తారు..ఎస్సీ, ఎస్టీ, బీసి, ముస్లిం మైనార్టీలపై దమనకాండకు హద్దుపద్దు లేకుండా పోయింది..ఒక్కఛాన్స్ అని కాళ్లు గడ్డాలు పట్టుకుని ఓట్లు వేయించుకుని తమనిలా దారుణంగా మోసగించిన జగన్మోహన్ రెడ్డిపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ పైన ప్రజలు రగిలిపోతున్నారు..ఇన్ని అబద్దాలా..? ఇన్ని ఆరోపణలా..?ఎన్నెన్ని మోసాలో..? వాటన్నింటినీ తల్చుకుని మండిపడ్తున్నారు..
జగన్ చెప్పిన అబద్దాలు-అసలు వాస్తవాలపై లోతైన చర్చ జరుగుతోంది..
1)కోడికత్తి కేసు-జగన్ హత్యకు టిడిపి కుట్ర: అదీ పచ్చి అబద్ధం. అందులో కుట్రకోణం అనేదే లేదని ఎన్ ఐఏ కౌంటర్ వేసింది నిన్న విజయవాడ కోర్టులో..జగన్ వేసిన పిటిషన్లలో అంశాలకు ఎన్ ఐఏ చెప్పిందానికి సంబంధమే లేదు..
అసలీ ఘటనకు ఎయిర్ పోర్టు రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కు సంబంధం లేదంది(అతని పేరు హర్షవర్దన్ చౌదరిగా పేర్కొన్న జగన్)..నిందితుడు శ్రీనివాస రావు టిడిపి సానుభూతి పరుడు కాదంది..ఇందులో కుట్రకోణమే లేదంది..సిసి టివి కెమెరాలు పనిచేయలేదని జగన్ చెప్పింది అబద్ధం, సిసి టివి కెమెరాలు పనిచేశాయి, ఫుటేజి మేము చూశామని కూడా చెప్పింది..
కోడికత్తితో తన హత్యకు చంద్రబాబు కుట్ర ఉందని, అప్పటి డిజిపి హస్తముందని సొంత మీడియాలో అప్పట్లో జగన్ చేసిన ప్రచారమంతా కట్టుకథే. అసలా కత్తిపోటే ఒక మిస్టరీ, ఆ తర్వాత విశాఖలో వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోయి తనకు నచ్చిన హాస్పటల్ లో బెడ్ పై పడుకుని, తనకిష్టులైన డాక్టర్లతో వైద్యం అంతా ఎన్నికల్లో సింపతీ కోసమేననేది ఓపెన్ సీక్రెట్టే..జగన్ కు వైద్యం చేసిన డాక్టర్లు సాంబశివా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డికి ఆ తర్వాత ఏపి ప్రభుత్వంలో పదవులు ఇవ్వడం తెలిసిందే.
2019మే లోనే శ్రీనివాస రావుకు బెయిల్ వచ్చింది. కానీ జగన్ రెడ్డి సీఎం కాగానే ఆ బెయిల్ రద్దైంది.. 4ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. జగన్ రెడ్డిని కోర్టుకు రావాల్సిందేనని సాక్షిగా హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తే, తాను కోర్టుకొస్తే ట్రాఫిక్ జామ్ అవుద్దని జగన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం.. సిఎం షెడ్యూల్ దెబ్బతింటుందని,వెల్ఫేర్ స్కీములకు ఇబ్బందని చెప్పడం మసిబూసి మారేడుకాయ చేయడం.
2)వివేకా హత్య కేసు-నారాసుర రక్తచరిత్ర: వైఎస్ వివేకా హత్య కేసు కూడా అంతే..మొదట గుండెపోటన్నారు, తర్వాత రక్తపు వాంతులన్నారు..మృతదేహంపై 7గొడ్డలి వేట్లు..2లీటర్ల రక్తపు మడుగు..ఆ తర్వాత హత్య అన్నారు, చంద్రబాబే చంపించాడని, లోకేశ్ పై కూడా ఆరోపించారు. బిటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిపై ఆరోపించారు. ప్రతిపక్షంగా సిఐడి దర్యాప్తు కావాలన్నారు, సీఎం అయ్యాక సిబిఐ వద్దన్నారు. సిబిఐ ఎస్పీ రాంసింగ్ ను వేధించారు, తప్పుడు కేసులు పెట్టారు, అరెస్ట్ చేయాలని చూస్తే హైకోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. భూతగదాలతో హత్య అన్నారు, రెండో భార్య కొడుకును వారసుడి ప్రకటనే కారణమన్నారు..అల్లుడే చంపించాడన్నారు..పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు, విచారణ జరగనీకుండా చేస్తున్నారు. కుమార్తె సుప్రీం కోర్టుకెళ్లడంతో విచారణ ఏపి నుంచి తెలంగాణకు మార్చింది. సునీతమ్మ పోరాటం వల్లే ఈమాత్రమైనా కదిలింది, లేకపోతే ఎప్పుడో కప్పెట్టేసేవాళ్లు..ఇప్పుడేమో సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించాడని, సునీలే చంపినట్లు మరో కథ అల్లారు..రోజుకో కథ, పూటకో పిటిషన్ గా ఎంక్వైరీని లాగింగ్…
3). పింక్ డైమండ్ పోయింది, సోదాచేస్తే చంద్రబాబు ఇంట్లో దొరుకుద్ది : ఎన్నికల ముందు విజయసాయి, రమణదీక్షితులు ఆరోపణలు.. శ్రీవారి పింక్ డైమండ్ పోయిందని, 12గంటల్లో సోదాలు జరపాలి, చంద్రబాబు ఇంట్లో దొరుకుద్ది, లేకపోతే ఎంపిగా రాజీనామా చేస్తానని అన్నారు ..చంద్రబాబును బద్నాం చేయాలని చూశారు. టిటిడి నేలమాళిగలోని శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు తరలించుకుపోయారని ఆరోపించారు.
జెనీవాలో వేలం వేసిన పింక్ డైమండ్, శ్రీవారిదీ ఒక్కటేనంటూ, ఆ క్లిప్పింగ్ తో ఈ ఫొటో పోలుస్తూ రమణదీక్షితులు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించాడు..
సాక్షాత్తూ ఏడుకొండల వాడినే రాజకీయ వివాదాల్లోకి లాగారు. టిటిడిపై, చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై నిందలేశారు. ఇద్దరిపై చెరో వందకోట్లకు టిటిడి రూ 2కోట్లు ఫీజు కట్టి మరీ పరువునష్టం దావా వేసింది. జగన్ సీఎం అయ్యాక టిటిడితో ఆ కేసు విత్ డ్రా చేయాలని చూశారు. కానీ కుదరలేదు, కొందరు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు కూడా, విచారణ కొనసాగుతోంది ఇంకా..
పింక్ డైమండ్ అసల్లేదని టిటిడి ఈవో చెప్పారు.., హైకోర్టు కూడా పింక్ డైమండ్ పై ఎంక్వైరీ అవసర్లేదని అంది. వాద్వా కమిటీ, జగన్నాథరావు కమిటీ నివేదికల్లో ఇదేమీ లేదని గుర్తుచేసింది.
4)ప్రమోషన్ పొందిన 36మంది డీఎస్పీలు కమ్మోళ్లే : ఎవరైతే డీఎస్పీలుగా ప్రమోట్ అయ్యారో ఆ మొత్తం 36మంది కమ్మోళ్లని, చంద్రబాబు సామాజికవర్గం వాళ్లని విజయసాయి రెడ్డి ఆరోపించారు, ట్వీట్లు చేశారు, సాక్షాత్తూ సభలోనే జగన్ రెడ్డి అన్నారు..కానీ అదంతా పచ్చి అబద్దమని తేలిపోయింది…ఆ 36మందిలో కమ్మ 5గురే…కాపు 3, బ్రాహ్మణులు 3గురు, రెడ్డి 3, మైనార్టీలు ఇద్దరు, క్షత్రియులు ఇద్దరు, బీసిలు 12, ఎస్సీలు 6గురు ఉన్నారు..
అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానమే అదంతా అబద్దమని చెప్పింది.
అన్నీ తప్పుడు ఆరోపణలే…పచ్చి అబద్దాలే:
5)చంద్రబాబు ప్రభుత్వం డేటా చౌర్యం చేసి ఓట్లు తొలగించిందన్నారు..కేంద్రమే చెప్పింది ఎటువంటి డేటా చౌర్యం జరగలేదని పార్లమెంటులో కేవిపి రామచంద్రరావు ప్రశ్నకు సమాధానంగా స్పష్టంచేసింది.
6)పోలవరంలో భారీ అవినీతి-చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నాడని అన్నారు: దీనిపై పెంటపాటి పుల్లారావు రాసిన లేఖలో పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.
7)మొదట పోలవరంలో అసలు పునాదులే పడలేదన్నారు. తర్వాత 20%పనులే చేశారన్నారు. కానీ 71% పనులు జరిగాయని జగన్ రెడ్డే కేంద్రానికి లేఖ రాశారు. 70%పనులు జరిగినట్లు కేశినేని నాని ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి జవాబిచ్చారు.
8) రూ 30వేల కోట్లు అంచనాలు పెంచింది చంద్రబాబు దోచుకోడానికే అన్నారు. కానీ సీఎం అయ్యాక ఇదే జగన్ మళ్లీ అవే అంచనాలు(చంద్రబాబు పంపినవే) పంపి కేంద్రాన్ని ఆమోదించాలని కోరారు.
9)రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకే పోలవరం పనులిచ్చి, రూ 780కోట్లు ఆదా చేశాం అన్నారు. అదీ అబద్దమే..మెయిన్ డ్యామ్ రూ 1656కోట్లు పెంచారు, రైట్ కెనాల్ లిఫ్ట్ రూ 912కోట్లు పెంచారు, ఇసుక రూ 500కోట్లు పెంచారు. ఒక్కరోజులో హెడ్ వర్క్ అంచనాలు రూ 2569కోట్లు పెంచారు.
10)పోలవరం 2021జూన్ కల్లా పూర్తి చేస్తామన్నారు..రేపు జూన్ కు రెండేళ్లు పూర్తి. ఇప్పుడు మళ్లీ 2023డిసెంబర్ కల్లా పూర్తి అన్నారు..4ఏళ్లలో 4% పనులు కూడా చేయలేదు.. ఇంకో 5ఏళ్లకు పూర్తికాదని ఇంజనీరింగ్ నిపుణులు చెప్పినట్లు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎగతాళి చేశారు.
11)పట్టిసీమలో రూ 400కోట్ల అవినీతి అన్నారు: ఆ ఆరోపణలన్నీ అబద్దాలని, ఎటువంటి ఆధారాల్లేవని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్పింది.
12)చంద్రబాబు 30కి పైగా స్టేలు తెచ్చుకుని బైట తిరుగుతున్నాడు, అవి తేలితే జైలుకెళ్లక తప్పదని ప్రచారం చేశారు: ఈ రోజుకు ఒక్క స్టే కూడా లేదు చంద్రబాబుపై..కేవలం బాబ్లీ ప్రాజెక్టు కేసు ఒక్కటి మాత్రమే ఉంది చంద్రబాబుపై..
13)మొదట కియా ప్రాజెక్టు బోగస్ అన్నారు. తాను సీఎం అయ్యాక ఆ భూములు మళ్లీ రైతులకే ఇస్తాం అన్నారు. తర్వాత ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డి వల్లే ఏపికి ఇప్పుడు కియా వచ్చిందన్నారు.
సిఎం అయ్యాక అదే కియాకు మరోసారి ఓపెనింగ్ చేసి, కియా వల్లనే యువతకు ఉద్యోగాలు వచ్చాయని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం..
14)ఇఎస్ ఐ కొనుగోళ్లలో రూ 151కోట్ల అవినీతి అన్నారు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
అచ్చెన్నాయుడికి ఈ స్కామ్ కి సంబంధం లేదని, దానికి ఆధారాల్లేవని, కేవలం ఒప్పందానికి అనుమతిచ్చారని ఏసిబి తేల్చి చెప్పింది.
15)ఫైబర్ నెట్ లో రూ 1500కోట్ల అవినీతి జరిగిందని, దానికి లోకేశ్ సంతకమే రుజువని, త్వరలో లోకేశ్ అరెస్ట్ తప్పదన్నారు. దీనిపై ఎఫ్ ఐఆర్ నమోదైన 19మందిలో అసలు లోకేశ్ పేరే లేదు. రూ 750కోట్ల ప్రాజెక్టులో రూ 1500కోట్ల అవినీతి ఏంటి, ఎలా సాధ్యం..?
16)ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా స్వాగతించాడు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అన్నాడు..గెలిచాక అమరావతిని చంపేశాడు, 3రాజధానులతో 3ముక్కలాట ఆడాడు. విజయసాయి రెడ్డిని విశాఖలో పెట్టి వేల ఎకరాల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడ్డాడు.
17)అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు బినామీలు భూములు కొన్నారని తప్పుడు ప్రచారం చేశారు. అసలు ఇన్ సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదని అక్కడ బినామీలు భూములు కొన్నట్లు ఆధారాల్లేవని హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ తేల్చిచెప్పాయి.
18)అమరావతిలో కమ్మవాళ్లే ఎక్కువని, కమ్మరావతి అని చెడ్డ ప్రచారం, కులాల కుంపటి..అమరావతి ఎస్సీ నియోజకవర్గం, అక్కడ ఎస్సీ ఎస్టీ 34%, రెడ్డి 23%, కమ్మ 18%, బీసి 14% ఉన్నారు. దాని చుట్టూ ఉన్నవన్నీ ఎస్టీ, ముస్లిం, వైశ్య, బీసి నియోజకవర్గాలే..18% కమ్మోళ్లతో అమరావతి కమ్మరావతి అవుద్దా..?
19)అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని, అదంతా బాహుబలి గ్రాఫిక్స్ అని దుష్ప్రచారం. అమరావతిలో భవనాలు 70% పూర్తయ్యాయని మున్సిపల్ శాఖ నివేదిక ఇచ్చింది.
20)టిటిడి బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని, వందల కోట్ల అవినీతి సొమ్ముతో సిబిఐకి దొరికిపోయాడని ఆరోపణ చేశారు. జగన్ సీఎం అయ్యాక అదే శేఖర్ రెడ్డిని మళ్లీ టిటిడి బోర్డు మెంబర్ చేశారు, ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ శేఖర్ రెడ్డి జెపి పవర్ వెంచర్స్ కే ఇచ్చారు, ఇప్పుడీ శాండ్ మాఫియా..
21)చంద్రబాబుపై రూ 6లక్షల కోట్ల అవినీతి అన్నారు, పుస్తకాలు వేశారు..4ఏళ్లైంది, చంద్రబాబుపై గాని, ఆయన కుటుంబంపైగాని రూ 6 అవినీతి కూడా నిరూపించలేక పోయాడు..
ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి చెప్పిన అబద్దాలకు అంతే ఉండదు..చేసిన దుష్ప్రచారానికి అవధులే లేవు..ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ అర్ధం చేసుకుంటున్నారు.
జగన్ అబద్దాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సంసిద్ధులయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే స్పష్టమైంది, మొత్తం 3ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి క్లీన్ స్వీప్ చేయడమే ఏపి ప్రజల్లో వచ్చిన మార్పుకు ప్రత్యక్ష సాక్ష్యం..
వర్రా రవీందర్ రెడ్డి రివర్స్ గేర్… సజ్జల గుండెల్లో వణుకు..!
తన దాకా వస్తే గానీ... ఆ కష్టమేమిటన్నది తెలియదట. పోలీసులకు పట్టుబడనంతవరకు భయం...