వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్ పెద్ద కుమార్తె.. హర్షారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. జగన్ పాదయాత్ర సమయానికి… సా*క్షి మీడియాతో పాటు.. పార్టీ బాధ్యతలను అప్పగిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సీటు గల్లంతవడం ఖాయం. జగన్ పాలిటిక్స్‌లోకి వచ్చినప్పుడు ముందుగా కడప నుంచే పోటీ చేశారు. అప్పట్లో కడప ఎంపీగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డిని పక్కన పెట్టి మరీ జగన్‌కి కడప ఎంపీ టికెట్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. జగన్ కుమార్తె కడప ఎంపీగా పోటీ చేస్తారని వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. నియోజకవర్గాల డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తున్న సమయంలో.. జగన్ కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకు రావాలి అనుకోవడం విశేషం. విజయసాయిరెడ్డి ఎగ్జిట్ తర్వాత వైసీపీకి జాతీయ స్థాయిలో సమర్ధమైన నాయకత్వం లేకుండా పోయింది. ఢిల్లీ పెద్దలతో సమన్వయం చేసుకొని.. జాతీయ స్థాయి పార్టీ ఫేస్ అండ్ వాయిస్‌గా జగన్ కుమార్తెను ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ పాదయాత్రలో బిజీగా ఉండే సమయంలో పార్టీ వ్యవహారాలతో పాటు మీడియా కో ఆర్డినేషన్ డ్యూటీ కూడా పెద్ద కుమార్తె హర్షారెడ్డికి అప్పగిస్తారని అంటున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులు జగన్, షర్మిల ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. షర్మిల కొడుకు రాజారెడ్డి పాలిటిక్స్‌ల్ ఎంట్రీకి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. జగన్‌కి ఇద్దరూ కుమార్తెలే కావడంతో.. ఆయన రాజకీయ వారసత్వం వారికే అప్పగించే అవకాశం ఉంది. ఎలాగూ రాజకీయాల్లోకి తీసుకు రావాలని అనుకొంటున్నారు కాబట్టి.. ప్రతిపక్షంలో ఉండగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మంచిదనే భావిస్తున్నారట.
జగన్ వారసురాలు వస్తే.. అవినాశ్‌రెడ్డి కడప ఎంపీ సీటు వదులుకోక తప్పదు. ఒకవేళ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగి.. సీట్లు పెరిగితే.. అవినాశ్‌రెడ్డిని కొత్త స్థానానికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వైసీపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్థాన చలనం కొత్తేమీ కాదు. కాక్రోచ్ జనతా పార్టీ వంటి యువతరం ఉద్యమాల కాలంలో.. జెన్‌జీ తరానికి దగ్గరగా ఉండే జగన్ కుమార్తె రాజకీయాల్లోకి వస్తే.. ఏపీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతాయి.











