వైసీపీ అధినేత జగన్ అతితెలివి ప్రదర్శిస్తున్నారు. పల్నాడు పర్యటనలో వివాదాస్పదమైన ప్లకార్డుల ప్రదర్శనను ఆయన సమర్థించారు. టీడీపీ వాళ్లను గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరి*కినట్లు రప్పారప్పా నరు*కుతా అంటున్నాడంటే మంచిదే కదా అంటూ ఆయన ఫ్యాక్షన్ వైఖరిని బయటపెట్టుకున్నారు. వాళ్ల కార్యకర్తే వైసీపీ అభిమానిగా మారి.. ఇప్పుడు టీడీపీ వాళ్లను నరు*కుతా అంటున్నాడంటే మంచిదే కదా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన నేర స్వభావానికి అద్దం పడుతున్నాయి. మీ కార్యకర్తలు రప్పారప్పా నరు*కుతామంటూ ఫ్లెక్సీలు పెట్టారని విమర్శిస్తున్నారని ఒక రిపోర్టర్ అడగ్గా.. జగన్ చాలా సెటైరికల్‌గా స్పందించారు. పూర్తి డైలాగ్ చెప్పు అనడంతో రిపోర్టర్ చెప్పారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు.. రప్పారప్పా నరి*కేస్తా అన్నారా? అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా! సినిమా డైలాగులు పెట్టినా తప్పే, ఫొటోలు పెట్టినా తప్పే, గడ్డం ఇలా అన్నా, అలా అన్నా తప్పేనా? అని జగన్ అన్నారు.
‘సార్, ఆ పోస్టర్ పట్టుకున్నతను టీడీపీ కార్యకర్త, ఆ పార్టీలో సభ్యత్వం కూడా ఉందంటూ సాక్షి విలేకరి ఫోన్‌లో ఫొటోలను చూపించగా..ఆ మనిషి గతంలో తెదేపాతో తిరిగిన ఫొటోలున్నాయా? టీడీపీ సభ్యుడిగా ఉన్నాడా? అంటే దానర్థం వాళ్లే పెట్టించారా? బాగా చూడండబ్బా అయితే. టీడీపీ సానుభూతిపరుడు కూడా చంద్రబాబు మీద కోపంతో అలా మారాడంటే సంతోషమే. టీడీపీనే రప్పారప్పా కోసేస్తానని అంటున్నాడంటే నిజంగానే బాధ ఉందేమో కదా. అన్ని పథకాలు ఎగురగొడుతున్నారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సాయం లేదు, సూపర్-6 లేవు, మరి బతుకులు చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో..టీడీపీ క్రియాశీలక సభ్యుడైనా కూడా వైసీపీలో చేరి, టీడీపీ వాళ్ల మీద ఆక్రోశం చూపిస్తూ..గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్లు రప్పారప్పా నరుకుతానని ఆయన అంటున్నాడంటే దానర్థం ఏంటి? చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు ఇంత కోపాన్ని చూపిస్తున్నారు. వాళ్ల కార్యకర్తే వాళ్ల నుంచి మారి వైసీపీ కార్యక్రమంలో పాలుపంచుకుని ఇలా మాట్లాడారంటే మంచిదే కదా అంటూ జగన్ కామెంట్ చేశారు.
షర్మిల ఫోన్ ట్యాపింగ్ పైనా అదే వెటకారం..
ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన కామెంట్స్‌పైనా జగన్ అదే వెటకారాన్ని ప్రదర్శించారు. మా హయాంలో నేను ట్యాపింగ్ చేశానా, లేకపోతే పక్క రాష్ట్రంలో చేశారంటున్నావా? అంటూ జగన్ ఎదురు ప్రశ్నించారు.. తెలంగాణలో నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసిందంటున్నారని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మ ఫోన్ ట్యాప్ చేసిందా? అంటే షర్మిలమ్మ బహుశా ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేశారేమో నాకేం తెలుసు..దానితో నాకేం సంబంధం? చేశారో లేదో నాకెలా తెలుస్తుందంటూ జగన్ కామెంట్ చేశారు.











