జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. వారాహి ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఎన్నికల ప్రచారలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించే పనిలో పడ్డారు.
పవన్ వాడి ఘాటు ప్రసంగాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ప్రజల ఆకాంక్ష మేరకు పని చేస్తానని, బాగా పని చేయలేదని భావిస్తే రాజీనామా చేస్తానని పవన్ చెబుతున్నాడు. టీడీపీతో పొత్తు ఖాయమని, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఏమీ లేదని గతంలో ప్రకటనలు చేసిన పవన్ ఇప్పుడు ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.
అంతేకాదు గతంలో సీఎం పదవిని చేపట్టే స్థాయి తనకు లేదని, ఆ కుర్చీలో కూర్చోవడం ఇష్టం లేదని చెప్పిన పవన్ ఇప్పుడు తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. పవన్ లో ఈ హఠాత్పరిణామం. వైసీపీలో కలవరపాటు నెలకొంది. గతంలో వైసీపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధమే కానీ.. సీఎం పదవికి మాత్రం సిద్ధం కాదని చెప్పిన పవన్ ఇప్పుడు ఇలా మాట్లాడటం వెనుక కారణాలు ఏంటని ఆరా తీస్తున్నారట వైసీపీ నాయకులు. ఉన్నటుంది పవన్ కళ్యాణ్ ఇంత అగ్రెసివ్‌గా ఎలా మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ వెనుక ఎవరున్నారు, ఈ ప్లాన్ ఎవరు సిద్ధం చేస్తున్నారని నిఘా వేశారంటే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి. అసలు పవన్ కళ్యాణ్ వ్యూహకర్త ఎవరో తెలుసుకోవాలని ఎంక్వయిరీ చేయిస్తున్నాడని తెలుస్తోంది..
ఈసారి అసెంబ్లీకి రాకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తామని చెబుతూనే.. తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. అయితే ఎక్కడా పొత్తుల ప్రస్తావన లేదు. అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పవన్ తన ప్రసంగాల్లో ఎక్కడా తగ్గడం లేదు, వైసీపీని సీఎం జగన్ మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకులని, మంత్రులని, ఎమ్మెల్యేల్ని ఎవరిని వదిలిపెట్టడం లేదు. పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకి వైసీపీ దగ్గర సమాధానం లేకుండాపోతుంది. పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇవ్వలేక తలలు పట్టుకుంటున్నారు.