లండన్ నుండి రెండు వారాల బ్రేక్ తర్వాత అమరావతికి వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి… పార్టీపై ఫోకస్ పెంచారు.. ముందుగా ఆయన విజయవాడలో తన పరువు నిలబెట్టుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.. మునిసిపల్ కార్పొరేషన్లు వరసగా వైసీపీ నుండి జారిపోతుండడంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. వైసీపీకి గుడ్ బై చెప్పి, టీడీపీకి జై కొడుతున్న నేతలు కొందరయితే, వైసీపీలోనే ఉంటూ కూటమి ప్రభుత్వానికి ఓటు వేస్తున్న కార్పొరేటర్లు మరికొందరు.. దీంతో, గతంలో అర్ధ, అంగబలంతో భయపెట్టి దక్కించుకున్న మునిసిపల్ కార్పొరేషన్లన్నీ ఒక్కొక్కటిగా కూటమి ఖాతాలో పడుతున్నాయి.. ఇప్పటికే, తిరుపతి, హిందూపురం, నెల్లూరు, నందిగామ లాంటి పలు కార్పొరేషన్లు వైసీపీ చేజారాయి..
https://youtu.be/-9pp3F15lP0?si=R0dbypTSq2OjL5-Gతాజాగా సేమ్ సీన్ విజయవాడలోనూ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది.. విజయవాడ కొర్పొరేషన్లో 64 డివిజన్లు ఉన్నాయి.. వీటిలో 15 డివిజన్లను టీడీపీ కైవసం చేసుకుంది.. మిగిలిన 49 స్థానాలు వైసీపీకి దక్కాయి.. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ఫ్యాన్ పార్టీ నుండి 15 మంది కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు.. టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.. మరికొందరు కార్పొరేటర్లు తెలుగు తమ్ముళ్లతో టచ్‌లో ఉన్నారు.. ఎన్నికల ఫలితం తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది..
తాజాగా విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీపై కొందరు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్నారు.. ఆమె వైఖరి నచ్చకపోవడంతో దిగిపోవాలని కోరుతున్నారు.. ఆమె నిరాకరించడంతో అవిశ్వాస తీర్మానికి సిద్ధం అవుతున్నారు విజయవాడ కార్పొరేటర్లు..
జగన్ లండన్ నుండి దిగి వచ్చిన తర్వాత బెజవాడ మేయర్ రాజకీయాలు ఆయన దృష్టికి వచ్చాయి.. అసెంబ్లీ ఎన్నికలలో పరువు పోగొట్టుకున్న వైసీపీకి కృష్ణా జిల్లాలో విజయవాడ మేయర్ పీఠం కూడా కోల్పోతే, జిల్లాలో పట్టు తగ్గుతుందనే ఆందోళనలో ఉంది ఆ పార్టీ అధిష్టానం.. అందుకే, జగన్ బెజవాడ అంశంపై ఫోకస్ పెట్టారు.. రాయన భాగ్యలక్ష్మి అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతే, జిల్లాలో ఆ పార్టీ ఉనికి నామరూపాలు లేకుండా పోతుంది.. అందుకే, పలువురు కార్పొరేటర్లకు స్వయంగా ఆయనే ఫోన్లు చేస్తున్నారని, మరికొందరిని తాడేపల్లి ప్యాలెస్‌కి పిలిపించుకొని సముదాయిస్తున్నారని సమాచారం.. 2029లో అధికారం మనదే అని, కొన్ని రోజులు గడ్డు పరిస్థితులని తట్టుకుంటే సీన్ మారిపోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మరి, జగన్ హామీలకి బెజవాడ వైసీపీ కార్పొరేటర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. మొత్తమ్మీద, బెజవాడ మేయర్ పీఠం వైసీపీకి సవాల్‌గా మారుతోంది…