రెండో రత్నం: ఫీజు రీయింబర్స్ మెంట్-పేదవాడి చదువుకయ్యే పూర్తి ఖర్చు భరిస్తాం. పూర్తి ఫీజు రీయింబర్స్ తో పాటు ప్రతి విద్యార్ధికి వసతి, భోజనం కోసం అదనంగా రూ 20వేలు, (ఫీజులు ఎంతైతే అంత ప్లస్ రూ 20వేలు)-ఏడాదికి రూ లక్ష నుండి రూ లక్షన్నర..
విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇప్పటిది కాదు..టిడిపి ప్రభుత్వం ఇచ్చేది, ఎన్టీఆర్ టైమ్ లో బీసిలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారు(రూ 30)..రాజశేఖర రెడ్డి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ శాచురేషన్ మోడ్ లో తీసుకెళ్లారు..ఆ తర్వాత రోశయ్య, కిరణ్, చంద్రబాబు ప్రభుత్వాలు మరింత ముందుకు తీసుకెళ్లాయి.
కానీ జగన్ రెడ్డి సీఎం అయ్యాక పాత సారా కొత్తసీసాలో పోశారు. అమల్లో ఉన్న స్కీమ్ ను రద్దు చేశారు. దానికే ‘‘జగనన్న విద్యాదీవెన’’ పేరెట్టారు…27నవంబర్ 2019నుంచి ఈ పేరుమీదే ఫీజులు చెల్లిస్తున్నారు.. ఐదారు ఇన్ స్టాల్ మెంట్లలో దాదాపు 11లక్షల విద్యార్ధులకు ఫీజులు చెల్లిస్తున్నారు. ఇచ్చే రూ 4,161కోట్లను 6వాయిదాలుగా విడగొట్టి ఒక్కో ఇన్ స్టాల్ మెంట్ కు రూ 670-700కోట్లు విదిలిస్తూ, అదీకూడా అమ్మల ఖాతాల్లో వేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ, వాటిని కూడా సకాలంలో రిలీజ్ చేయకుండా అటు అమ్మల్నీ, ఇటు పిల్లల్నీ ఏడ్పించుకు తిన్న సీఎంగా జగన్ రెడ్డిదే క్రెడిట్..
కాలేజీవాళ్లేమో పూర్తి ఫీజులు కడితేనే సర్టిఫికెట్లిస్తామని ఏడ్పిస్తున్నారు. దీవెన ఏమోగాని ఏడుపే మిగిలింది.
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు చేశాడు. అసలు నిన్నెవరు మార్చమన్నారు, జరిగేదాన్ని జరగనీకుండా ఎవరాపమన్నారు..? ఏదో చేస్తానని చెప్పి మరేదో చేశాడు.
పాత ప్రభుత్వ బకాయిలు రూ 1,178కోట్లు కలిపి జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద రూ 11,715కోట్లు చెల్లించారు..
ఈ పాత బకాయిల చెల్లింపేమీ జగనే కొత్తగా చేసేది కాదు. అదంతా ఆన్ గోయింగ్ ప్రాసెస్.. రాజశేఖర రెడ్డి బకాయిలు రూ 5వేల కోట్లు నేనే తీర్చానని కిరణ్ అన్నాడు..
అలాగే గత ప్రభుత్వ బకాయిలు రూ 4వేల కోట్లు తామే రిలీజ్ చేశామని చంద్రబాబు చెప్పారు. కానీ అదే పదేపదే చివరికి మీడియా యాడ్స్ లో కూడా చెప్పడం ఇప్పుడే చూస్తున్నాం..ఇది సర్వసాధారణాంశం. పరిపాలనా పరమైన అంశం..రేపు నువ్వు దిగిపోతే, నువ్వు పెండింగ్ పెట్టినవి వచ్చే ప్రభుత్వం చెల్లిస్తుంది, వాళ్లుకూడా ఇలాగే యాడ్స్ వేయాలా..?
‘‘జగనన్న వసతి దీవెన’’..డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్ధులకు రూ 20వేలు, పాలిటెక్నిక్ వాళ్లకు రూ 15వేలు, ఐటిఐవాళ్లకు రూ 10వేలు బోర్డింగ్, లాడ్జింగ్ కింద ఇవ్వాలి. అదీ అరకొరే, సకాలంలో ఇచ్చిందీ లేదు, నెలల తరబడి పెండింగ్ లే..
‘‘జగనన్న విద్యాదీవెన’’ కింద 2,17,238మంది ఎస్సీ విద్యార్ధులు, 45,450మంది ఎస్టీలు, 5,30,995 మంది బీసీ విద్యార్ధులు, 1,02,707మంది కాపులు, 70,964మంది మైనార్టీ విద్యార్ధులకు లబ్ది..
అమ్మవడిలో డబ్బులు పడ్డ 10రోజుల్లో కాలేజీలకు ఫీజులు కట్టాలి, లేకపోతే నేరుగా కాలేజీలకే జమ..
మొన్న బాపట్లలో బటన్ నొక్కారు సీఎం జగన్..6వ ఇన్ స్టాల్ మెంట్..రూ 693కోట్లు, 11లక్షల మందికి..భావితరాలకు మనమిచే సంపద విద్య. పేదరిక నిర్మూలన చేసేది, జీవితాలు మార్చేది విద్యే..
సకాలంలో వీటిని విడుదల చేయరు.. విద్యార్ధి సంఘాలు ధర్నాలు చేస్తేతప్ప రిలీజ్ ఉండదు. ఫుల్ ఫీజ్ రీయింబర్స్ మెంట్ అనేది నెరవేరని కలే..
జీవో 77 రద్దు చేయాలని టిడిపి సహా విపక్షాల డిమాండ్..అర్హులైన ప్రతిఒక్కరికీ అమ్మవడి, విద్యాదీవెన, వసతి దీవెన ఇవ్వాలి. వెల్ఫేర్ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు, కాస్మటిక్ ఛార్జీలు పెంచాలి..
పాదయాత్ర హామీలు, మేనిఫెస్టో హామీలు 95% నెరవేర్చామనడం పెద్ద జోక్.. జాబ్ కేలండర్ ఏమైంది..? 4ఏళ్లలో ఏం చేశారు..? ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది..?
జగన్ చెప్పిన రెండో రత్నమూ నకిలీదే – విద్యాదీవెన- వసతి దీవెన-దీవెనలేమో గాని ఏడుపులే మిగిలాయి..
యూనివర్సిటీల్లోనూ రాజకీయాలతో కలుషితం చేశారు. నాగార్జున వీసి, ఆంధ్రా వీసిల చేష్టలు అందరూ చూశారు. విశ్వవిద్యాలయాల్లో వైసిపి ప్రచారం, జగన్ రెడ్డి భజన చేసేవాళ్లే వైస్ ఛాన్సలర్లుగా బరితెగింపు.
మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే చూశాం విశాఖ, గుంటూరులో..ఆర్జెడి ప్రతాప్ రెడ్డి అయితే ఏకంగా ఓట్ల కోసం టీచర్లను బెదిరించడం…ఆయన భార్య ఎమ్మెల్సీ ప్రచారం చూశాం..
4ఏళ్లలో ఏపి విద్యారంగం భ్రష్టుపట్టించారు. ఏపిలో టీచర్లను కూడా లోనేశారని హరీశ్ రావు ఎగతాళి చేశారు..మద్యం షాపుల ముందు టీచర్లను కాపలా పెట్టినప్పుడే దిగజారింది. టీచర్లతో బాత్ రూమ్ ల ఫోటోలు తీయించడం చూసినోళ్లు ఎగతాళికాక ఇంకేంటి..?
జగన్ నవరత్నాల్లో ‘‘ఆరో రత్నం అమ్మవడిని’’ కూడా అధ్వానం చేశారు..రెండో ఏడాది అమ్మవడి పూర్తిగా ఎగ్గొట్టాడు. అమ్మవడి పేరుతో ఇచ్చినట్లే ఇచ్చి నాన్నబుడ్డితో దానికి ఐదారు రెట్లు లాగేశాడు. పేదలకు జగన్ చేసే సంక్షేమం ‘‘ఇచ్చేది గోరంత, దోచేది కొండంత’’. రాష్ట్రంలో మొత్తం విద్యావ్యవస్థనే అస్తవ్యస్తం చేశాడు.
ఇంగ్లీషు మీడియం ముసుగులో మాతృభాషా బోధనా విధానాన్ని రద్దుచేశారు. ఎవరెన్ని ఆందోళనలు చేసినా, చివరికి కోర్టులే మొట్టికాయలేసినా లెక్కచేయలేదు, ఈ ముసుగులో 10-12వేల టీచర్ పోస్టులెత్తేశారు..టిడిపి తెచ్చిన ఆదర్శ పాఠశాలలనే రద్దుచేశారు. కిమీకు ఒక ప్రైమరీ స్కూల్ ను తీసేసి, 3కిమీకో ప్రైమరీ స్కూల్ తెచ్చారు. 3,4,5 తరగతులను హైస్కూల్ లో వేశారు.
4500ప్రైమరీ స్కూళ్లను ముక్కలు చేశారు, 2500ప్రైమరీ స్కూళ్లు ఎత్తేస్తున్నారు. ఏది చేసినా టీచర్ పోస్టులు మిగుల్చుకోవడం కోసమే చేశారు. విద్యార్ధి ఉపాధ్యాయ నిష్పత్తి 20: 1 ఉండాల్సింది, 60:1 చేశారు. టీచర్లకు పనిభారం పెంచేశారు, బోధనా పనికి బదులు ఇతర పనులు చెప్పారు..అందుకే విద్యారంగం ఇంత భ్రష్టుపట్టింది..
ఈ 4ఏళ్లలో ఏపిలో విద్యాహక్కు చట్టాన్ని భ్రష్టుపట్టించారు. ప్రతి కిమీకు ఒక ప్రాధమిక పాఠశాలను ఎత్తేశారు..
జగన్ సీఎం కాగానే ఏడాదిలోనే ఏపిలో 1395పాఠశాలలు మూసేశారని, 1463మంది టీచర్లు తగ్గారని యున్కెనెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్(యుడిఐఎస్ ఈ ) 2020-21 నివేదిక చెప్పింది. అంటే ఇప్పటికి దాదాపు ఐదారువేల స్కూళ్లు మూతేశారు..
డ్రాప్ అవుట్స్ జాతీయ సగటు 12.61%వుంటే ఏపిలో 16.29%ఉన్నట్లు కేంద్రమంత్రే చెప్పారు.
ఏపిలో సింగిల్ టీచర్ స్కూల్స్ 6557ఉన్నాయని రాష్ట్ర మంత్రే చెప్పారు, కానీ వాస్తవంగా అయితే ఈ సంఖ్య అంతకు రెట్టింపే.. ప్రాధమిక విద్య ఎంత అధ్వానంగా మారిందో తెలుస్తోంది..
‘‘నాడు-నేడు’’ అనేదొక స్కామ్..నాసిరకం కట్టుబడులు, మళ్లీ వాటికి రంగులేయడం, వేలకోట్ల దోపిడీ..ఎంతమంది హెచ్ ఎంలు గుండెఆగి చనిపోయారు..? టీచర్ల ఛలో విజయవాడ నాడేమైందో అంతా చూశారు కదా..?
ఈ 4ఏళ్లలోనే నిరుద్యోగం 24% పెరిగింది. యువతలో ఉద్యోగిత రేటు 4ఏళ్లలో సగానికి పడిపోయింది.. ఆరేడు లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయినట్లు అసెంబ్లీలో ఇదే ప్రభుత్వం చెప్పింది, కానీ వాస్తవంగా ఫీల్డ్ లో చూస్తే దానికి నాలుగైదు రెట్లు..
ఉపాధి లేదు, ఉద్యోగాల్లేవ్, జీవనోపాధి లేక యువతలో అశాంతి ప్రబలింది. చదువుకున్నోళ్లకు ఉద్యోగాల్లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయరు, ప్రైవేటు ఉద్యోగాలను రానీయరు..వాటాల కోసం బెదిరించి పారిశ్రామిక వేత్తలను తరిమేశారు.
నిరుద్యోగ భృతి నెలకు రూ 1000ఇచ్చారు చంద్రబాబు దాన్నీ ఎగ్గొట్టారు జగన్ రెడ్డి..
తెలుగుదేశం హయాంలో ఇలా ఉందా..? ఎన్టీఆర్, చంద్రబాబులెలా చేశారు. విద్యా, ఉపాధి రంగాలను పరుగులు పెట్టించారు. గురుకులాలు, రెసిడెన్సియల్ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టళ్లన్నీ తెచ్చింది ఎన్టీఆరే.. ప్రతి కిమీకు ప్రాథమిక పాఠశాల, 3కిమీకు హైస్కూల్, 5కిమీకు హైస్కూల్, డివిజన్ కో ఇంజనీరింగ్ కాలేజి, జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టింది చంద్రబాబే..
వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు..రైతుబిడ్డలు ఇవాళ దేశవిదేశాల్లో ఇంజనీర్లుగా రాణిస్తున్నారంటే అదంతా చంద్రబాబు క్రెడిటే..పెద్దఎత్తున పెట్టుబడులు రాబట్టి, పరిశ్రమలు తెచ్చి ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించారు.
ఐటి రంగంలో ఒక పోస్టు వచ్చిందంటే దానికి అనుబంధంగా ఐదారు ఉద్యోగాలొచ్చేవి. ఐటి రంగాభివృద్ధితో ఉపాధి అవకాశాలు నాలుగైదు రెట్లకు విస్తృతం చేసింది చంద్రబాబే..
ఇప్పుడదే ఐటి రంగంలో ఏపి వాటా 0.2% అంటే ఏమనాలి..? ఉపాధి కల్పనకు కీలకమైన ఐటిని చావుదెబ్బ తీశాడు. విశాఖలోనే 100స్టార్టప్ లు మూతబడ్డాయి.
గత 4ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంతా భ్రష్టు పట్టించారు. విద్యా ఉపాధి రంగాలను చావుదెబ్బ తీశారు..
ఇదే జగన్ రెండో రత్నం..దీవెనల ముసుగేసి ఏడుపులే..ఆరో రత్నం అమ్మవడి నాన్నబుడ్డికి సరి..