వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి మాదిరి తయారైందనే చెప్పాలి. తాను రాజకీయంగా బలోపేతం అయ్యేందుకు తన సోదరి వైఎస్ షర్మిలను బాగానే వినియోగించుకున్న జగన్,… అధికారం చేతికి అందగానే ఆ చెల్లిని దాదాపుగా ఇంటి నుంచి గెంటేసినంత పనిచేశారు. తనతో పాటు తన చెల్లి ఉంటే… ఆమె ఎక్కడ తనకూ అధికారం ఇవ్వమని అడుగుతుందనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఏపీ సీఎంగా పదవీ ప్రమాణ చేసిన రోజుల వ్యవధిలోనే జగన్,షర్మిలల మధ్య దూరం పెరిగిపోయింది. కాలక్రమేణా ఇద్దరి మధ్య బద్ధ శత్రుత్వం ఏర్పడింది.
ఇదంతా ఆస్తిలో తనకూ వాటా ఇవ్వాలని షర్మిల అడిగితే… అందుకు ససేమిరా అన్న జగన్…ఆడపిల్లవు గనుక ఆస్తిలో వాటా ఇచ్చేది లేదని తేల్చేసిన జగన్… ఈ విషయంలో తాను తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. చేసేది లేక అన్న ఇంటికి దూరంగానే ఉండిపోయిన షర్మిల… జగన్ మాదిరే తనలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి రక్తమే ప్రవహిస్తోందని భావించారు. తాను కూడా రాజకీయంగా ఎందుకు ఎదగకూడదని భావించారు. అనుకున్నదే తడవుగా తన రాజకీయ ప్రస్థానానికి పక్కా ప్రణాళికలు వేసుకుని షర్మిల జగన్ తన కాళ్ల బేరానికి వచ్చేలా చేశారు.
మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో జగన్ కు కళ్లు బైర్లు కమ్మినంత పనైందని చెప్పాలి. అప్పటిదాకా తనతో సఖ్యతగానే ఉన్న బీజేపీ… ఎన్నికలకు కాస్తంత ముందుగా తన ప్రత్యర్థులైసన టీడీపీ, జనసేనలతో జట్టు కట్టడం.. ఆ కూటమే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావంవడంతో జగన్ ఇక తన పని అయిపోయినట్టేనని భావిస్తున్నారు. జగన్ లో ఈ భయాన్ని పెంచేలా కూటమి సర్కారు ప్రణాళికాబద్ధమైన చర్యలతో దూకుడు చూపిస్తోంది. జగన్ అధికారంలో ఉండగా… తాపే సైగ చేయగానే విపక్షాలపై విరుచుకుపడిన వారందరినీ… ఆయా కేసుల్లో వరుసగా బుక్ చేస్తూ జగన్ ను దాదాపుగా ఒంటరిని చేసిందనే చెప్పాలి.
కూటమి సర్కారు దెబ్బలతో అప్పటిదాకా జగన్ కు నమ్మినబంటుల్లా సాగిన వారంతా చిన్నగా జగన్ కు దూరం జరిగారు. వైసీపీని వీడిపోతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీని వీడగా… మరికొందరు కూడా అదే బాటలో సాగుతున్నారు. ఇంకొన్నాళ్లకు జగన్ శిబిరంలో ఎక్కడ కూడా అవకాశం లేని నేతలు మాత్రమే కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో మొన్నటిదాకా ఎలాగూ బీజేపీతో అంటకాగిన నేపథ్యంలో తనపై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో జగన్ అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు అదే బీజేపీ… జగన్ ను జైలుకు పంపించి తీరాల్సిందేనన్న కసితో సాగుతున్న టీడీపీీతో జట్టు కట్టింది. మరి ఇప్పుడు తనకు అండగా నిలిచేవారెవరన్న దిశగా యోచించిన జగన్ కు గతంలో తనను జైలుకు పంపిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే కనిపించింది. ఆ కాంగ్రెస్ కు ఏపీ అధ్యక్షురాలిగా తాను గెంటేసిన తన సోదరి షర్మిలే కొనసాగుతున్నారు. అయితేనేం… ఇతరుల వద్ద సాగిలపడే దానికి బదులుగా తన సోదరి వద్ద సాగిలపడితే తప్పేముందని జగన్ భావించినట్లున్నారు.
అనుకున్నదే తడవుగా తాడేపల్లి నుంచి బెంగళూరులోని తన విలాసవంతమైన ప్యాలెస్ కు చేరిన జగన్… సోదరి షర్మిలను అక్కడికే పిలిపించుకున్నారు. ఇరువురి మధ్య విడతల వారీగా చర్చలు జరగ్గా,…షర్మిలకు ఆస్తిలో వాటా ఇచ్చేందుకు జగన్ ఒప్పుకున్నారు. ఆ తర్వాత జగన్ ను కాంగ్రెస్ దరికి చేర్చే దిశగా జగన్ కు సాయం చేసేందుకు షర్మిల అంగీకరించారు. మొత్తంగా అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడ్డ అగాథం కనుమరుగైపోయిందని వైఎస్సార్ అభిమానులు సంతోషిస్తున్నారు.
వైఎస్సార్ అభిమానులు సంతోషపడుతుంటే… ఇంతటి మంచి డీల్ కుదిరినా కూడా జగన్ కు కంటి మీద కునుకు పడటం లేదట. ఎందుకంటే… షర్మిలతో చర్చలను గానీ, ఆమెతో చెలిమి గానీ, ఆస్తిలో ఆమెకు వాటా ఇవ్వడం జగన్ సతీమణి వైఎస్ భారతికి సుతారమూ ఇస్టం లేదట. వాస్తవానికి షర్మిలపై కొంతమేర సాఫ్ట్ కార్నర్ ఉన్న జగన్… భారతి బోధనలతోనే తోడబుట్టిన చెల్లిని కూడా దూరం చేసుకునేందుకు జగన్ వెనుకాడలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మొన్నటి ఎన్నికల్లో జగన్ ను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించిన షర్మిల…జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వీటిని జగన్ కు పదే పదే గుర్తు చేస్తూ సాగిన భారతి… జగన్, షర్మిలల మధ్య మరింత దూరాన్ని పెంచేశారని వినికిడి.
అయితే ఇప్పుడు తన వాస్తవ పరిస్థితిని గుర్తించి… దాని నుంచి క్షేమంగా బయటపడేలా షర్మిలతో సఖ్యత తప్పించి మరో మార్గం లేదన్న జగన్ వాదనతో భారతి ఏకీభవించలేదట,.ఇంటి నుంచి గెంటేసిన షర్మిలతో మళ్లీ చర్చల ముచ్చటేమిటని కూడా జగన్ ను భారతి నిలదీసిందట.ఈ సందర్బంగా భారతి, జగన్ ల మధ్య ఓ రేంజిలో వాదులాట జరిగినట్లుగా సమాచారం. మరి బయటి పోరును చల్లబరిచేందుకు యత్నించిన జగన్ కు ఇప్పుడు ఇంటి పోరు మొదలైపోయింది. ఈ పోరు నుంచి ఆయన ఎలా బయటపడతారో చూడాలి.