టీడీపీ అరెస్ట్ తర్వాత ఇంటెలిజెన్స్ సర్వే చేయించిన జగన్ కి ఊహించని ఫలితాలు ఎదురయ్యాయని ఏపీ రాజకీయాలలో ప్రచారం జరుగుతోంది.. చంద్రబాబు అరెస్టు తర్వాత 1 నుంచి ఒకటిన్నర శాతం ఓటర్లు వైసీపీకి దూరం అయ్యారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అరెస్ట్ పరిణామాల తర్వాత సుమారు 2 శాతం పైగా ఓటర్లు టీడీపీ అనుకూలంగా మారారాని తెలుస్తోంది.. ఇటు ఓట్ల పరంగా సుమారు 6-9 లక్షల ఓట్లను పోగొట్టుకోనున్నట్లు సమాచారం.
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వైసీపికి శాపంగా మారబోతోందా? కుట్ర రాజకీయాలతో వచ్చే ఎన్నికలకు ముందే వైసీపీ ఓటర్లను దూరం చేసుకుందా? చంద్రబాబును అరెస్ట్ పై జగన్ చేయించుకున్న సొంత సర్వేలో వెలుగులోకొచ్చిన అంశాలు ఆ పార్టీని షాక్ లోపడేశాయా? అంటే.. గట్టిగా అవునంటున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం నిసందేహంగా తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా బాబు అరెస్ట్ ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చిన అంశమన్నది ఎంత నిజమో వైసీపికి ఓటర్లు దూరమవుతున్నారన్నది అంతకంటే పచ్చి నిజం.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అమాంతం వేడెక్కాయి. నిన్నటి మొన్నటి వరకూ ఉన్న పొలిటికల్ హీట్ డబుల్ కావడంతో ఎవరెటో తేలిపోయింది. ఊసరవెల్లి రాజకీయాలకు పెట్టింది పేరైన తాడేపల్లి ప్యాలెస్ 2024 ఎన్నికల్ల కోసం రోజుకో సర్వే చేయించుకుని సంబరపడిపోతుండటం జగమెరిగిన సత్యం. కానీ లేటెస్ట్‌గా చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిపిన సర్వే ఫలితాలు జగన్ వర్గానికి ఊహంచని షాకిచ్చాయి. తాము చేసిన తప్పుకు శాశ్వతంగా రాజకీయాలకు దూరమయ్యేరోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపించేలా ఆ సర్వే ఫలితాలుండటంతో జగన్ వర్గం సైలెంట్ గావ్యూహం మార్చింది.
ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న తరుణంలో వైసీపికి ఓటర్లు దూరమవడం మింగుడుపడటంలేదు. స్వయంగా ఇంటిలిజెన్స్ చేసిన ఈ సర్వేలో ఒకటి నుంచి ఒకటిన్న శాతం వరకూ ఓటర్లు వైసీపీకి దూరమైతే రెండు శాతానికి పైగా ఓటర్లు టీడీపికి అనకూలాంగా మారిపోయాన్న పచ్చినిజం జగన్ వర్గానికి దిమ్మతిరిగేలా చేసింది. ఇంటిలిజెన్స్ సర్వే ప్రకారం… చంద్రబాబు అరెస్ట్ తర్వాత దాదాపు 10 లక్షలమంది ఓటర్ల మొత్తంగా వైసీపికి దూరమయ్యారట. ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువే ఉంటుందన్నది ఇంటిలిజెన్స్ రిపోర్ట్ సమగ్ర సారాంశం.
ఈ సర్వే రిపోర్ట్ పరిశీలించాక జగన్ కోటరీతో పాటు 175 సీట్లు గెలుస్తామని తెగ సంబరపడిపోతున్న లీడర్లంతా అయోమయంలో పడ్డారట. దీంతో ఈ కుట్ర రాజకీయాలకు ఇప్పటికిప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ నేతలంతా జగన్ కు సమాచారం పెట్టారని కూడా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో చచ్చీ చెడీ గెలిచిన నేతలంతా ఓటర్లు జారిపోతే ఏం చేయాలో చెప్పండంటూ జగన్ కు మొరపెట్టుకున్నారనికూడా సమాచారం. తమ గ్రాఫ్ పడిపోయి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగితే భవిష్యత్ ఏంటని చాలా మంది డైలమాలో పడ్డారని కూడా మరికొంత మంది చెబుతున్నారు. ఇవన్నీ నిజమేననిపించేలా ప్రతి కూల అంశాలనుకూడా అనుకూలంగామార్చుకుని తెలుగుదేశం పార్టీ ముందుకెళుతోంది.