విద్యావ్యవస్థను నాశనం చేస్తున్న జగన్..!!
వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసాడు. ఆంధ్ర ప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టం మొత్తానికి మారుస్తాను, ప్రైవేట్ స్కూల్స్ కూడా , ప్రభుత్వం స్కూల్స్ ముందు దిగదుడుపే అని వాగ్దానాలు చేసాడు. ఏపీలో విద్యావ్యవస్థని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాను అని మాట ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి , ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే జగన్ ప్రభుత్వం వచ్చాక విద్యావ్యవస్థ మరీ అద్వానంగా తయారయ్యింది. పచ్చిగా చెప్పాలంటే జగన్ ఆదీనంలో విద్యావ్యవస్థ బ్రష్టుపట్టింది. 2019 ఎన్నికల ముందు ఆంధ్ర ప్రదేశ్ లో విద్య వ్యవస్థను క్షున్నంగా పరిశీలించి, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలలో ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెడుతామని, అలాగే టీచర్స్ కూడా ఆంగ్లం మాట్లాడే టీచర్స్ ని అప్పోయింట్ చేస్తానని హామీలిచ్చారు.
ఇకనుండి ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్లం మాత్రమే ఉంటుంది తెలుగు టీచర్ కానీ, తెలుగు మాట్లాడేవారు కానీ ఉండరని మాటిచ్చిన జగన్, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. అదీగాక ఈ మధ్య GO 177ని కూడా రద్దు చేసాడు.
అలాగే రాబోయే రోజులలో ఎడ్యుకేషన్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది, అందుకు అనుగుణంగా పాఠశాలలో, కళాశాలలో ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించి, ప్రొజెక్టర్ల ద్వారా టీచింగ్ చెప్పే విధంగా ఒక సిస్టంని తయారు చేస్తాను అన్నాడు. అలాగే ఉన్నత విద్యలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ భవిష్యత్తు తరాలలో ముఖ్యభూమిక పోషిస్తోంది, ఆ సబ్జెక్టు ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు.
ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని, అలాగే అభివృద్ధి అని సాకులు చెప్పి ఏ ఒక్కటి చేయలేక, మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకి హామీలు ఇస్తున్నారు తప్పితే, దాని అమలు పరిచే ఆలోచన, ఆ శాఖా మంత్రులకి కానీ, అధికారులకి కానీ లేదు అని ఇట్టే అర్ధమవుతోంది. వైసీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ అన్నిటిలో అభివృద్ధి కుంటిపడిందని చెప్పాలి