సొంత ఇల్లు ప్రతి ఒక్కరి జీవిత కల ..పట్టన పేద వర్గాల వారి కల నెరవేర్చడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆవాస యోజనలో భాగంగాపట్టనంలో ఉండే ప్రతి ఒక్క పేద కుటుంబానికి, సొంత ఇల్లు అందించే బృహత్తర పధకాన్నీ పూర్తి చేసింది . ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా .. పేదల సొంత ఇంటి కలను సాకారం చేసుకునేలా టిడ్కో ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీల నిర్మాణాన్నీ నాటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది ..పట్టన పేదల సొంత ఇంటి కల , చంద్రబబు కృషితో
దాదాపు సాకారం అయింది .దీని కోసం మొత్తం ఐదు లక్షల ఏడు వేల రెండు వందల పదిహేను ఇళ్లను మంజూరు చేసి … వాటిలో చాలావరకు పూర్తి చేశారు .. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా మూడు రకాలుగా ఇళ్లను నిర్మించారు .అందులో భాగంగా .. మొదటి నిర్మాణంగా మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో , ఏడు లక్షల రూపాయలతో నిర్మితమయ్యే గృహాలను లబ్దిదారులకు కేవలం లక్ష అరవై ఐదు వేలకే అందించేలా రూపొందించారు .అలాగే మూడు వందల అరవై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన హాల్, ఓ పడకగది ఇంటిని దాదాపు తొమ్మిది లక్షల ఖర్చుతో నిర్మించారు . దీనిని లబ్దిదారులకు రెండు లక్షల అరవై ఐదు వేలకే అందించాలని భావించారు ..ఇక చివరగా 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన హాలు , రెండు గదులతో పాటు మరెన్నో సౌకర్యాలతో అధునాతనంగా పట్టన గృహసముదాయాలు గత టీడీపీ ప్రభుత్వంలోనే రూపుదిద్దుకున్నాయి
అన్ని సౌకర్యాలతో అధునాతన టైల్స్ , వాల్ కుట్టి , ఇతర సౌకర్యాలు కలిగి ఉండేలా ..షేర్ వాల్ అనే దక్షిణకొరియా సాంకేతిక పరిజ్ఞమతో అద్భుత నిర్మాణాలు పట్టన ప్రజలకు చేరువ చేయాలనీ నాటి సీఎం చంద్రబాబు సంకల్పించి వాటిని దాదాపు పూర్తి చేశారు .. వీటితో పాటు.. వ్యాపార ,వాణిజ్య, క్రీడా అవసరాల కోసం మరిన్ని నిర్మాణాలు చేపట్టారు . రోడ్లు ,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ,ప్రాధమిక పాఠశాల ,ఆరోగ్య కేంద్రాలు ,పార్కులు ఇంకా చిన్నారుల కోసం అంగన్ వాడి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ సకల సౌకర్యాలతో అద్భుతమైన ఇళ్లను గత ప్రభుత్వం నిర్మించింది .నాటి ఉమ్మడి పదమూడు జిల్లాలో ఐదు లక్షల ఏడు వేల రెండు వందల పదిహేను ఇళ్లకు శ్రీకారం చుట్టి వాటిలో చాలావరకు పూర్తి చేశారు .. 2022 నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే చంద్రబాబు సమున్నత ఆశయంతో నాటి ప్రభుత్వం ముందుకు సాగింది .. అయితే పేదల దుర్భాగ్యమో .. మరేంటో కానీ 2019 లో ప్రభుత్వం మారింది .. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ..
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త నిర్మణాలు చేపట్టడం అటుంచి .. పూర్తి అయిన వాటినే లబ్ది దారులకి ఇవ్వలేదు పేదల కోసం టీడీపీ లక్షలాది టిడ్కో ఇళ్లు కట్టించినా … వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పేదలకి పంచలేదు .. గత ప్రభుత్వం అమరావతిలో కూడా పేదలకు వేల ఇళ్లు కట్టించింది. అయితే పేదల వ్యతిరేకి అయిన జగన్ ఆ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించడం లేదు.. తాను చేసింది లేదు గత ప్రభుత్వం పూర్తి చేసిన వాటిని ఇచ్చింది లేదు .. అంతేకాక రాజధాని కోసం ఎన్నో త్యాగాలని చేసిన అమరావతి ప్రజలని అవమానిస్తున్నారు .. ఇప్పుడు పేదల విషయంలోనూ దారుణంగా వ్యవహరిస్తూ .. కనీసం వారికీ గూడు లేకుండా చేస్తున్నారు .. టీడీపీ ప్రభుత్వం కట్టించిందన్న కారణం .. వారికీ ఎక్కడ పేరు వస్తుందో అన్న భావనతో వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటుంది .
అండమాన్లో ఎగిరిన టీడీపీ జెండా..!
టీడీపీ,బీజేపీ కూటమి మరో ఘనత సాధించింది. అండమాన్ - నికోబార్ దీవుల్లో సత్తా...