ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి బలపనూరుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికారు. ఇక్కడి ప్రజలు, రైతులు,కార్యకర్తలు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారు. పులివెందులులో చంద్రబాబుకు భారీ ఎత్తున స్వాగతం ఇదే మొదటిసారి అని, అందులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత గ్రామం, సింత టౌన్ కూడా.. అంతకుముందు కడప జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న గండికోట సీబీఆర్ లిఫ్ట్ ప్రాజెక్టు పనులను టీడీపీ అధినేత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సింహాద్రిపురంలోని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఇంటికి వెళ్లారు.
అయితే చంద్రబాబు పులివెందులకు వస్తున్నాడని తెలిసి, సీఎం జగన్ మోహన్ రెడ్డి జమ్మలమడుగుకి మెల్లగా జారుకున్నాడని సమాచారం. జగన్ సొంత గ్రామంలో వైసీపీ జండా చిరిగిపోవడం ఖాయం , పులివెందులలో టీడీపీ జెండా ఎగరడం పక్క అని తెలుస్తోంది.
జగన్ సొంత గ్రామంలో చంద్రబాబుకి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు, అడుగడుగునా పూల వర్షం కురిపించారు. దీనిబట్టి జగన్ ఇలాకాలో కూడా వైసీపీ మీద ప్రజలు పూర్తిగా వ్యతిరేకత తో ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ సొంత గ్రామా ప్రజలే వైసీపీ వద్దు, టీడీపీ ముద్దు అంటున్నారంటేనే పరిస్థితి ఎలా ఉంది అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వ విధానాలు ప్రజలకి అందడం లేదు, ప్రజల పేరు చెప్పు, పథకాల పేరుతో సొంత జేబులు నింపుకుంటున్నారు వైసీపీ నాయకులు.
అయితే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు ప్రజల కష్టసుఖాలు, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి , అలాగే ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి చేసారు, టీడీపీ హయాంలో డెబ్భై శాతంకి పైగా పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వం అందులో సగం కూడా చేయలేదని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఎప్పటికి ప్రజల క్షేమం కోసమే పాటుపడుతుందని, వైసీపీ నాయకుల్లాగా ప్రజలను టీడీపీ ఏనాడు మోసం చేయలేదని అన్నాడు.
చంద్రబాబు నాయుడు ప్రోజెక్టుల గురించి మాట్లాడుతుంటే, ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు మాత్రం బ్రో సినిమా గురించి మాట్లాడారని విమర్శించారు. మంత్రులు తమ సొంత కంపెనీల నుండి డబ్బు దోచుకోవడానికి కాంట్రాక్టర్ల వలె నటించారు. ఆగస్టు 2వ తేదీకి కూడా శ్రీశైలం మోటార్లు ఆన్ చేయలేదు. పోలవరం ప్రాజెక్టుపై గిన్నిస్ రికార్డులు వస్తే.. ఇప్పుడు విమర్శలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులకు వరదలొస్తే కనీసం తిండి కూడా పెట్టలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే పోలవరం ముంపు మండలాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంటామన్నారు.