టీడీపీ – జనసేన పొత్తుకు రెడీ అయ్యాయి.. మరి, ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోంది.. లీడర్లు కలిసిపోయారు సరే.. కేడర్ సంగతేంటి.? దీనిపై జగన్ సర్వే చేయించుకుంటుండగా విస్తుబోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని సమాచారం..
2024 ఎన్నికలకు ముందు టీడీపీ-జనసేన పొత్తు చాలా సందేహాలకు తెర దించింది. తమతో పొలిటికల్ గేమ్ అంత ఈజీకాదన్న సంకేతాలు వైసీపీకి ఆ రెండు పార్టీలు పంపాయి. టార్గెట్ 2024 లక్ష్యం వైపు అడుగులేస్తున్న టీడీపీ-జనసేన మైత్రి బంధానికి అనేక సానుకూల అంశాలు కలిసి రాబోతున్నాయి. జగన్ మూర్ఖపు నిర్ణయాలను అనుకూలంగా మరల్చుకునేందుకు చంద్రబాబు- పవన్ కళ్యాణ్ వ్యూహాత్మంగా అడుగులేస్తున్నారు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు రాజకీయ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ కు అందించారు. ఆ వ్యూహంలో భాగమే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడతలో టీడీపీ శ్రేణులు హాజరై కొత్త ఉత్సాహాన్ని నింపారు. పార్టీ కేడర్ ను బలోపేతం చేసేందుకు ఇప్పుడున్న తరుణంలో ఇంతకు మించి మరో మార్గం లేదన్న చంద్రబాబు వ్యూహం బ్రహ్మాండంగా వర్కవుటవుతోంది.
త్వరలో ప్రారంభం కాబోతున్న లోకేశ్ పాదయాత్రలోనూ జనసేన శ్రేణులు కూడా పాల్గొనబోతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా కేడర్ కూడా కలిసిపోతుందన్నది చంద్రబాబు మార్క్ రాజకీయం. పొత్తు బంధాన్ని దృఢంగా ఉంచడంతో పాటుఓటు బ్యాంకును కూడా కాపాడుకోవచ్చని తెలుగుదేశం ప్లాన్. లీడర్లు కలిసిపోయినా కేడర్ లో అసంతృప్తి ఉందన్న అభిప్రాయాన్ని దూరం చేసేందుకే ఈ నిర్ణయం. ఇవన్నీ కలిసొస్తే టికెట్ల పంపకం కూడా సులువువుతుందని తెలుగుదేశం పార్టీ నిర్ణయం. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా అడుగులు ముందుకేస్తున్నారు.
సర్వేతో పగటి కలలు కంటూ ఉండే జగన్‌కు చంద్రబాబు అరెస్ట్ చేసిన తర్వాత జరిపిన రెండు సర్వేల్లోనూ షాకు మీద షాకు తగిలింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇంటిలిజెన్స్ ఇచ్చిన నివేదికలో ఓటు బ్యాంకు మైనస్ అవుతుందన్నది మొదటి షాక్. పది లక్షల మంది ఓటర్లు చంద్రబాబు అరెస్ట్ అనంతరం వైసీపికి దూరమయ్యారన్న ఇంటిలిజెన్స్ నివేదికలతో వైసీపీ నేతలెవరికీ నిద్రపట్టనివ్వకుండా చేశాయి. జనసేన- టీడీపీ మైత్రీ బంధం బలమేమిటో తెలుసుకోవలన్న అత్యుత్సాహంతో సర్వే చేయించిన జగన్‌కు మైండ్‌బ్లాంక్ అయ్యే సమాధానం దొరికింది. స్వయంగా తన సొంత సర్వే సంస్థలే అలాంటి నివేదికలు ఇవ్వటంతో ఇంకా జగన్ షాకు నుంచి కోలుకోలేదట.
జిల్లాలకు జిల్లాలే తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నది సొంత సర్వే సంస్థలు తేల్చిన నిజం తెలుసుకుని నివ్వెర పోయిన జగన్ తీరిగ్గా తేరుకున్నాక మరో సారి అదేఅంశంపై సర్వే చేయమని ఆదేశాలిచ్చారట. రెండో సారి జరిపిన సర్వేలోనూ అలాంటి నివేదిక రావటంతో చంద్రబాబును అరెస్ట్ చేయించి అనవసరంగా కెలికానా?.. అన్న ఆలోచనలో పడిపోయారట. ఇప్పడేం చేయాలి?.. ఎలా ముందుకెళ్లాలన్న అంశాల అర్జెంటుగా కోటరీతో మీటింగ్ పెట్టేసి చిందులు తొక్కేసిన తర్వాతే జగన్ రెడ్డి ఆవేశం చల్లారిందట. అంచనాలు ఇలా ఎలా తల్లకిందులయ్యాయా అని ఆలోచనలో పడ్డ జగన్ ఢిల్లీ పెద్దలకు విషయం వివరించబోతున్నారట కూడా