సీనియర్ పొలిటీషియన్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన బాంబ్ పేల్చారు.. ఏపీ సర్కార్ ఇటీవల జగన్ హయాంలో జరిగిన లిక్కర్ దందా సుమారు 4 వేల కోట్ల రూపాయలు అని లెక్కలు కట్టింది.. తాజాగా ఈ లెక్కలను, అంచనాలను సవరించాల్సిన అవసరం ఉందని, ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో అర్ధం అవుతోంది.. ఏపీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ స్కామ్ కంటే చాలా పెద్దదని, కనీసం 10రెట్లు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ..
2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత నాటి లిక్కర్ పాలసీని అమాంతం మార్చేశారు. అప్పటివరకు ప్రభుత్వం కేవలం లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేది.. లిక్కర్ షాపులకు లాటరీ పద్ధతిలో టెండర్లు నిర్వహించేవారు.. లాటరీలో ఎవరిని అదృష్టం వరిస్తుందో వారు లక్కీ.. కానీ, జగన్ పవర్ చేపట్టిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేశారు.. డిస్టిల్లరీ కంపెనీల దగ్గర నుండి సరఫరా వరకు మొత్తం ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరిగింది.. దీంతో, లిక్కర్ క్వాలిటీ పడిపోయింది.. చీప్ లిక్కర్ అమ్ముతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇటు, మందుబాబుల ఆరోగ్యం దెబ్బతీశారు.. మద్యనిషేధం పేరుతో పెంచిన లిక్కర్ ధరలు.. పేదలకు శాపంగా మారాయి.. ఈ పాలసీపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్లాయనే ఆరోపణలు వినిపించాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించింది..
ఇప్పటికే విచారణ చేపట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్… ఈ దందా సుమారు 4 వేల కోట్ల రూపాయలని తేల్చి పారేసింది.. అయితే, ఇది అంతకుమించి ఉండవచ్చని, దీని విలువ సుమారు 30 వేల కోట్ల రూపాయలని ఆరోపిస్తున్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. ఏపీలో లిక్కర్ పాలసీపై లోక్ సభలో జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్‌లో జరిగిన లిక్కర్ అవినీతిపై దుమ్ము దులిపారు..
లిక్కర్ షాపులను ప్రయివేటు నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చి వేల కోట్ల రూపాయలను తమ బొక్కసాలకి తరలించుకున్నారని ఆరోపించారు సీఎం రమేష్.. మద్యం దుకాణాల్లో ఆ అయిదేళ్లలో సుమారు లక్ష కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని, ఈ లావాదేవీలన్నీ క్యాష్ రూపంలోనే సాగాయని గుర్తు చేశారు సీఎం రమేష్.. ఒక్క పేమెంట్ కూడా డిజిటల్ రూపంలో తీసుకోలేదని, లిక్కర్ షాపులలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులని నియమించి దందా నడిపించారని ఆరోపించారు.. దీనిపై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కలుగజేసుకునే యత్నం చేశారు.. సీఎం రమేష్‌కి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. దీంతో, మరింత రెచ్చిపోయిన సీఎం రమేష్.. జగన్ లిక్కర్ దందా దేశంలోనే అతి పెద్దదని, ఢిల్లీలోని కేజ్రీవాల్ హయాంలో చోటు చేసుకున్న స్కామ్ కంటే ఇది పది రెట్లు అధికమని విరుచుకుపడ్డారు.. ఇప్పటికే విచారణలో ఉన్న ఈ మద్యం స్కాములో రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలాంటి ట్విస్టులు, టర్నులు చోటు చేసుకుంటాయో చూడాలి..