మద్యం పాలసీపై జగన్ రివర్స్ గేర్…???
తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన వ్యాఖ్యలకు సవరణలు ఇచ్చుకున్నారు.. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తానన్న ఆయన, లిక్కర్ రేట్లను పెంచి ఫైవ్ స్టార్ హోటళ్లకు పరిమితం చేస్తానన్న జగన్… ఆ దిశగా వేసిన అడుగులు శూన్యం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా లిక్కర్ రేట్లను భారీగా పెంచడం, తక్కువ క్వాలిటీ చీప్ లిక్కర్‌ని ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే వాదన ఉంది.. ఇటు, ప్రయివేటు దుకాణాలను తీసివేసి ప్రభుత్వ ఆధీనంలోనే లిక్కర్ షాపులు ఓపెన్ చేశారు.. మద్య నిషేధం గురించి ఎవరైనా అడిగితే పేద పథకాలకు డబ్బులు రాకుండా చేస్తున్నారని అంటున్నారు. దీన్ని బట్టే జగన్ రెడ్డి మైండ్ సెట్‌ను అర్థం చేసుకోవచ్చంటున్నారు.
వచ్చే అక్టోబర్‌తో ఈ లిక్కర్ పాలసీ విధానం ముగియనుంది.. దీని స్థానంలో కొత్త లిక్కర్ పాలసీని అమలు చేయడానికి జగన్ సర్కార్ పునరాలోచన చేస్తోందట.. గతంలో అమలు చేసిన ప్రయివేటు లిక్కర్ పాలసీని మరోసారి తెరమీదకు తీసుకురావడానికి రెడీ అవుతోందట.. తాజాగా మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం తెలంగాణలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.. ఒక్కో టెండర్ దారుడు లైసెన్స్ కోసం రెండులక్షల రూపాయలకుపైగా ఫీజ్ చెల్లించాలి.. వీటిద్వారా తెలంగాణ సర్కార్‌కి ఏకంగా రూ. 2500 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది.. తాజాగా కేసీఆర్ సర్కార్ అమలు చేస్తోన్న పలు సంక్షేమ పథకాలకు ఈ నిధులు ఉపయోగపడ్డాయనే వాదన ఉంది.. దీంతో, జగన్ సర్కార్ సైతం తన సంక్షేమ పథకాల నిధులకు ప్రయివేటు వ్యక్తులకు లిక్కర్ దుకాణాలను కట్టబెట్టే ఆలోచనలో ఉందట..
మరోవైపు, లిక్కర్ దుకాణాలను ప్రభుత్వమే అమలు చేయడంతో అనేక మంది పార్టీ కార్యకర్తలు, నేతలకు ఆదాయం తగ్గిపోయిందనే వాదన ఉంది.. ఇది వైసీపీ కేడర్‌లోనే నెగిటివ్‌గా మారిందనే రిపోర్టులు అందాయట.. ఎన్నికలకు ముందు మరోసారి కేడర్‌కి చేరువ కావడానికి లిక్కర్ పాలసీని మార్చాలని భావిస్తోందట జగన్ సర్కార్..
అయితే, అయిదేళ్లలో మద్యనిషేధం పూర్తిగా అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్…. దానిని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.. ఇప్పటిదాకా లిక్కర్ పాలసీతో వేల కోట్ల రూపాయలు దండుకున్నారని, ఏటా జే ట్యాక్స్ ద్వారా తాడేపల్లి ప్యాలెస్‌కి సుమారు 6 వేల కోట్ల రూపాయలు చేరుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.. దీంతో, జగన్ వ్యక్తిత్వం గురించి తెలిసిన నేతలు.. లిక్కర్ పాలసీ మార్చరని అభిప్రాయ పడుతున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి.