వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని జైలు పిలుస్తోందా.?? ఈ విషయం ఆయనకు క్లారిటీ ఉందా..?? లేక, ఆయనకు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి సేకరించిన సమాచారంతో చెబుతున్నారో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మరోసారి జైలుకు వెళ్లక తప్పదేమో అనే సంకేతాలు అందుతున్నట్లు కనిపిస్తోంది..
లండన్ నుండి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రెండుసార్లు ప్రెస్ మీట్‌లు నిర్వహించారు వైసీపీ అధినేత.. ఈ రెండు సార్లు కూడా ఆయన స్పీచ్ వేరు వేరుగా ఒక అంశం మాత్రం క్లారిటీగా ఉందని తెలుస్తోంది. అదే జైలు అంశం.. తనను జైలుకు పంపడం ఖాయమని, త్వరలోనే తనను అరెస్ట్ చేస్తారని, అయినా భయపడేది లేదని ఒకసారి చెబితే, తాజాగా తనపై త్వరలో మరిన్ని కేసులు పడడం ఖాయమని, అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలిపారు.. అంటే, గత అయిదేళ్లలో ముఖ్యమంత్రిగా జగన్ ఎంతటి దారుణమైన నిర్ణయాలు తీసుకున్నారో, ఏ స్థాయిలో అవినీతి చేశారో ఆయనకే అర్ధం అయిందని విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు..
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా, విద్యుత్ మీటర్ల స్కామ్, విద్యా వ్యవస్థలో స్కామ్, ఇసుక స్కామ్, మైనింగ్ స్కామ్, జగన్ అన్న ఇళ్ల కోసం స్థలాల సేకరణలో స్కామ్.. ఇలా ఒక్కటేమిటి, ఏ వ్యవస్థనూ ఆయన వదల్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తన హయాంలో సుమారు 9 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, లక్షల కోట్లను విదేశాలకు తరలించారని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.. వీటిపై ఇటీవల ఓ లేఖ కూడా విడుదల చేసింది టీడీపీ..
ఇవన్నీ పక్కన పెడితే, జగన్.. తన హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని ఎలాంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో అరెస్ట్ చేశారు.. 52 రోజులపాటు జైలులో ఉంచారు.. దీంతో, తనపై పగ సాధిస్తారని.. జగన్ భయపడుతున్నట్లు కనిపిస్తోందని కొందరు వైసీపీ నేతలు లెక్కలు కడుతున్నారు.. అయితే, తాను పగ, ప్రతీకారాలకు పోనని, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏని అరెస్ట్ చేయాలంటే బోలెడు ఆధారాలున్నాయని, అనేక కేసులు ఉన్నాయని ఇప్పటికే చంద్రబాబు పలు మార్లు క్లారిటీ ఇచ్చారు..
తనను జైలుకు పంపుతారని జగన్ పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే సానుభూతి కోసమే అనే విమర్శలు వస్తున్నాయి.. ఇటీవల ఢిల్లీ ఎన్నికలలో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా కేజ్రీవాల్‌పై సానుభూతి రాలేదు.. ఆయన ఓడిపోయారు.. జగన్‌కి కూడా ఇదే గతి పడుతుందని, ఆయనకు సానుభూతి వచ్చే చాన్స్ లేదని రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది.. కేవలం డ్రామా కోసమే జగన్ నాటకాలు ఆడుతున్నారని, ఆయనపై గత పదేళ్లుగా ఉన్న కేసులే తప్ప, కొత్తగా ఏ ఒక్క కేసు కూడా దాఖలు కాలేదని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు.. ఇదే ఇప్పుడు జగన్‌ని మరింత టెన్షన్ పెడుతోంది.. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ఆయన భయపడుతున్నారని సమాచారం..