జగన్తో బీజేపీ పెద్దలకి మంచి అనుబంధం ఉంది.. ఇద్దరి మధ్య గుడ్ లుక్స్ నడుస్తున్నాయి.. అందుకే, సోము వీర్రాజుని తప్పించిన తర్వాత ఎవరిని నియమించాలనే అంశంపై మీనమేషాలు లెక్కించిన బీజేపీ హై కమాండ్.. చివరికి జగన్ని సంప్రదించి పురంధేశ్వరిని ఫైనలైజ్ చేశారనే ప్రచారం జరుగుతోంది..
భారతీయ జనతా పార్టీ బిజెపి నాలుగు రాష్ట్రాల్లో కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. నియామకాలు జరిగిన రాష్ట్రాల్లో పంజాబ్, జార్ఖండ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో, లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించిందని భావిస్తున్నారు.
అయితే కొత్త అధ్యక్షుల నియామకం జరిగిన రాష్ట్రాల్లో పాత అధ్యక్షుల పదవీకాలం ముగిసింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త అధ్యక్షుల నియామకం వెనుక ప్రధాన కారణం ఏమిటి? దాని వెనుక ఎవరున్నారు? అనే కోణంలో ఆలోచిస్తున్నారు, ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ చీఫ్ గ పురేందేశ్వరిని నియమించడానికి కారణమెవరు అని ఆరా తీస్తే షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి, పురేందేశ్వరిని ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ గ నియమనిచడానికి తెరవెనుక జగన్ ప్లాన్ అని తెలుస్తోంది, చంద్ర బాబు నాయుడుతో ఢీ కొట్టే సత్తా వైసీపీలో లేక , పైగా ఆంధ్రాలో వైసీపీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని గమనించిన సీఎం జగన్ ఈ స్ట్రాటజీ అమలు చేసాడని గుసగుసలు వినపడుతున్నాయి.
అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చే సార్వత్రిక ఎన్నికలకోసం బీజేపీ అమలు చేస్తున్న కొత్త వ్యూహంగా చెప్పుకోవచ్చు ఎందుకంటె చంద్ర బాబు , పురందేశ్వరి ఒకే సామజిక వర్గానికి చెందినవారు, పైగా బంధువులు కూడాను , చంద్రబాబు సామజిక వర్గ ఓట్లు చీల్చడం కోసమే ఈ ఎత్తుగడ అని అర్ధమవుతుంది ఇదంతా “జగన్నాటకం” అంటున్నారు..