రుషికొండ రహస్యం ఏంటి…??
రుషికొండ.. రుషికొండ.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం రుషికొండ చుట్టూ తిరుగుతూన్నాయి. గతకొంత కాలంగా రుషికొండ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. దానికి కారణం వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమ తవ్వకాలు. అక్రమ తవ్వకాల వల్ల ప్రకృతి నాశనం అవుతుందని, ఏ పర్మిషన్ లేకుండా అక్రమంగా రుషికొండని తవ్వి అందవిహీనంగా మార్చేశారు.
విశాఖపట్నంలో బీచ్ కి అందం ఈ రిషికొండ. ఎటుచూసినా పచ్చని కొండలు, ఆహ్లదకరమైన వాతావరణం ఉండేది. ఇక్కడికి పర్యాటకులు రుషికొండని చూడటానికి వస్తు ఉంటారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా, మట్టి తవ్వకాలు, గనుల తవ్వకాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఓడరేవు విశాఖపట్నంలోని రుషికొండ ప్రాజెక్టులో పర్యావరణ సీఆర్‌జెడ్ ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలియజేసిన సంగతే తెలిసిందే.
అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ రిషికొండని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రజలకి కళ్ళకి కట్టినట్టు చుపుపించారు. రుషికొండపై జగన్ సర్కారు తలపెట్టిన నిర్మాణాలు దేనికోసం? ఎవరికోసం? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. ఇదిలా ఉంటె రిషికొండ వివాదం గత కొంతకాలంగా రాజకీయ పార్టీలలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.వైసీపీ, టీడీపీ, మరియు జనసేన పార్టీ లీడర్లు రుషికొండలో జరుగుతన్న అక్రమాల గురించి ఒకరి పై ఒక్కరు మాటల యుద్దానికి దిగారు. అలాగే సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు..
రుషికొండ పై జరుగుతున్న నిర్మాణాలపై, అక్రమ తవ్వకాల పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు రుషికొండలో ఏమి జరుగుతుంది? రుషికొండ రహశ్యం ఏమిటి? ఎందుకు అధికార పార్టీ వైసీపీ నాయకులు రుషికొండ పేరు ఎత్తగానే పూనకాలు వచ్చినట్టు ఊగిపోవడానికి గల కారణాలు ఏంటని సరికొత్త ప్రశ్నలు మొదలైతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనని అడ్డుకునే ప్రయత్నం చేసారు. దాంతో ఇంకా అనుమాలు పెరుగుతున్నాయి. అసలు రుషికొండలో ఏమి దాస్తున్నారు?
అయితే వైసీపీ నాయకులు కొత్తగా రుషికొండపై సెక్రటేరియట్ కడుతున్నాం అని సోషల్ మీడియా వేదికగా కొత్త ట్విస్ట్ ఇచ్చారు.. రుషికొండలో సెక్రటేరియట్ ఎందుకు కడుతున్నట్టు? వైజాగ్ లో ఇంకా ఎక్కడ స్థలం లేదా? అని ప్రతిపక్షం నాయకులు ఆడుతున్నారు. అయితే గతంలో టూరిజం కి సంబందించిన నిర్మాణాలు జరుగుతున్నాయని కోర్ట్ కి తెలిపింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఉన్నటుండి అక్కడ సెక్రటేరియట్ కడుతున్నాం చెప్పడంతో సరికొత్త వివాదం చెలరేగుతోంది. అయితే వైసీపీ ప్రభుత్వం కోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారు అనే అనుమాలు వస్తున్నాయి..
ఏది నిజం? ఏది అబద్దం వైసీపీ నాయకులు చెప్తున్న కట్టుకథలు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్ధం కానీ అయోమయం స్థితిలో ఉంది ఉన్నారు..