వైసీపీ సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి రోజాని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వదిలించుకోవడానికి రెడీ అవుతున్నారా.?? మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాలో సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అభీష్టం మేరకు రోజాకి పార్టీలో చెక్ పెడుతున్నారా.? ఆమెని పొమ్మనకుండానే పొగబెడుతున్నారా…?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
నగరి నియోజకవర్గం నుండి మూడుసార్లు పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు రోజా.. నగరి అంటే ఆమె సొంత నియోజకవర్గం.. రోజాకి కంచుకోట.. ఇలాంటి నియోజకవర్గంలో ఆమె రెండు సార్లు గెలిచి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.. అలాంటి సెగ్మెంట్‌లో ఆమెకి తెలియకుండా ఇతర పార్టీ నుండి జంప్ చేసి వస్తోన్న నేతకు జగన్ స్వాగతం పలికి మరీ కండువా కప్పుతున్నారంటే అది సాధారణ విషయం కాదు.. కనీసం ఆమెకి ఈ కార్యక్రమానికి కూడా పిలుపు లేకపోవడం విశేషం…
నగరి నియోజకవర్గంలో రోజా ప్రత్యర్ధి శిబిరమైన గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్.. బుధవారం వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.. గాలి భానుప్రకాష్ ప్రస్తుతం నగరి ఎమ్‌ఎల్‌ఏగా ఉన్నారు.. ఆయన సోదరుడు జగదీష్‌తో రాజకీయ బేదాభిప్రాయాలు ఉన్నాయి.. గాలి జగదీష్.. గత ఎన్నికలలో టీడీపీ టికెట్ ఆశించారు.. భాను ప్రకాష్ వైపు ఆ పార్టీ అధినేత మొగ్గు చూపారు.. దీంతో, గాలి జగదీష్.. వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయ్యారు..
సొంత సోదరుడితో గాలి భాను ప్రకాష్‌కి ఉన్న అభిప్రాయ బేధాలను క్యాష్ చేసుకోవడానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. జగదీష్‌ని చేరదీస్తున్నారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.. కుటుంబాలను విడగొట్టే రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండి పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు.. అయితే, జగన్ ఆలోచన వేరేలా ఉంది.. రోజా నోటి దురుసుతనం వైసీపీకి నెగిటివ్‌గా మారిందనే చర్చ ఉంది.. ఇలాంటి నేతలను దూరం పెట్టాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట.. గత ఎన్నికలలో జరిగిన డ్యామేజ్‌ని తగ్గించుకోవాలంటే, రోజాలాంటి నేతలకు ఇక టికెట్ ఇవ్వకూడదని జగన్ యోచనలా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి..
మరోవైపు, రోజాపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.. మంత్రిగా ఆమె అనేక అరాచకాలు సాగించారని, వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్లలో ఆమె సుమారు 2 వేల కోట్లు వసూళ్లు చేశారని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు.. తిరుమలలో దర్శనాల కుంభకోణంలో వందల కోట్లు వెనకేశారని ఆరోపణలు ఉన్నాయి.. దీంతో, ఆమె పార్టీకి గుదిబండలా మారుతున్నారని లెక్కలు కట్టిన జగన్.. ఆమెకి హ్యాండ్ ఇవ్వడానికే సిద్ధం అయ్యారని సమాచారం.. మరి, ఈ పరిణామాలకి రోజా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..