వైఎస్ ఫ్యామిలీలో విబేధాలున్నాయనేది ఓపెన్ సీక్రెట్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన సొంత సోదరీమణులు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతకి అభిప్రాయ బేధాలున్నాయని ఇప్పటికే పలు మార్లు ప్రూవ్ అయింది.. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల చేసిన కామెట్స్.. వైసీపీని ముఖ్యంగా జగన్, అవినాష్ ఫ్యామిలీని నడిరోడ్డుపై నిలబెట్టాయి.. అయితే, అన్నా చెల్లెళ్య మధ్య గ్యాప్ మరింత పెరిగిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎమ్ డీ వీకెండ్ కామెంట్ బై ఆర్ కేలో ప్రస్తావించారు..
అన్న జగన్ తో విబేధించిన షర్మిల … తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి పోరాటం చేస్తున్నారు.. యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీగా నామకరణం చేసి గత రెండేళ్లుగా ఫైట్ చేస్తున్నారు.. ఆమెకి ఇక్కడ ఎంత మైలేజ్ దక్కుతోంది… ఆమె పార్టీ ఏ మేరకు ప్రజల విశ్వాసం, ఆదరణ దక్కించుకుంటుందనేది పక్కన పెడితే… షర్మిలకి ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడం కష్టంగా మారుతోందట.. ఇదే విషయాన్ని ఇటీవల షర్మిల తన తల్లి విజయలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారని సమాచారం..
కూతురు కష్టాలు చూడలేక.. విజయలక్ష్మి వెంటనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సంప్రదించారట.. షర్మిల పార్టీకి ఫండ్స్ ఇవ్వాలని, ఆమెకి ఆర్ధికంగా కొంత సాయం చేయాలని కోరారట.. వైఎస్ హయాం నుండి వేమిరెడ్డితో ఆ కుటుంబానికి సన్నిహిత బంధం ఉండడంతో విజయలక్ష్మి ఆయన సాయం కోరారని సమాచారం..
షర్మిలకు తాను సాయం చేయలేనని, జగన్ ఫండ్స్ ఇవ్వమని చెబితేనే తాను ముందుకు రాగలనని తెలిపారట వేమిరెడ్డి.. ఇదే విషయాన్ని వేమిరెడ్డి.. జగన్ కి వివరించారట.. తల్లి విజయలక్ష్మి తనను షర్మిల పార్టీకి నిధులు ఇవ్వాలని కోరారని విన్నవించారట.. దీనిపై జగన్ సీరియస్ అయ్యారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎమ్ డీ రాధాకృష్ణ తన వీకెంట్ కామెంట్ లో వెల్లడించారు.. షర్మిలకు పైసా ఇవ్వవద్దని, ఇస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారట.. ఇదే విషయాన్ని విజయలక్ష్మికి తెలియజేశారట వేమిరెడ్డి..
అంతే, విజయలక్ష్మి ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారట.. తన కూతురుకి సొంత కొడుకు సాయం లభించకపోవడంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారని సమాచారం.. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి షర్మిలతో ఆయనకు గ్యాప్ వచ్చిందని పార్టీ వర్గాలలోనే ప్రచారం జరుగుతోంది. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ఎపిసోడ్ తో మరోసారి ప్రూవ్ అయిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.. వివేకా హత్య కేసులో అన్నాచెల్లెళ్లు చెరో పక్షం తీసుకున్నారు.. మరి, రాబోయే రోజుల్లో వైఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ ఎంతగా రచ్చకెక్కుతాయో చూడాలి.