వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి..PCC చీఫ్ షర్మిల ట్రాప్‌లో పడ్డారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైఎస్ షర్మిల తన కుమార్తె అంజిలిరెడ్డి వివాహ వేడుకను నవంబరు 25వ తేదీన బెంగళూరులోని యలహంక ప్యాలెస్ వేదికగా జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని పెళ్లి కార్డుల్లోనూ అత్యంత ప్రముఖంగా ప్రచురించిన ఆమె, ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అయితే, పెళ్లి వేదికగా యలహంక ప్యాలెస్‌ను ఖరారు చేయడం వెనుక షర్మిల వేసిన పక్కా ప్లాన్ ఇప్పుడు జగన్ దంపతుల అసలు నైజాన్ని బయటపెట్టేసింది.
నిజానికి ఈ వేదికపై పెళ్లి చేయడానికి జగన్ సుముఖంగా ఉండరని, అభ్యంతరం తెలుపుతారని షర్మిలకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే యలహంక ప్యాలెస్‌ను వేదికగా నిర్ణయించి, కార్డుల్లో ముద్రించడం ద్వారా జగన్ నిజస్వరూపాన్ని బాహ్య ప్రపంచానికి బట్టబయలు చేయాలనే ప్లాన్‌తో షర్మిల స్కెచ్ వేశారు. తీరా వివాహ పత్రికలు పంచిన తర్వాత, ఆ ఇల్లు తన అత్తగారి అంటే భారతి తల్లి పేరిట ఉందని, అందులో పెళ్లి చేయడానికి వీల్లేదంటూ జగన్ అడ్డుపుల్లలు వేసి కొత్త డ్రామాలకు తెరతీశారు.
వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడే బెంగళూరు యలహంకలోని 20 ఎకరాల స్థలంలో కుమారుడు జగన్, కుమార్తె షర్మిల కోసం పక్కపక్కనే రెండు భారీ భవంతులు నిర్మించారు. అప్పట్లో ఆర్థిక లావాదేవీల ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆ భవంతిని జగన్ అత్తగారి పేరిట పెట్టించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు షర్మిలకు రాత పూర్వకంగా రిజిస్ట్రేషన్ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, ఆ ఇల్లు తనదేనంటూ జగన్ పెళ్లికి అడ్డంకులు సృష్టించడం ఆయన రాక్షస స్వభావాన్ని బయటపెడుతోందని విమర్శలు వస్తున్నాయి. కన్న తల్లి విజయమ్మ నచ్చజెప్పినా జగన్ ససేమిరా అనడంతో కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం జగన్ దంపతులు తీవ్ర సందిగ్ధంలో పడిపోయారు. ఈ పెళ్లికి హాజరుకాకపోతే సొంత మేనకోడలి వివాహానికి ఇల్లు ఇవ్వకపోవడమే కాకుండా వేడుకకు దూరం జరిగారనే చెడ్డపేరు ప్రజల్లోకి వెళ్తుంది. మరోవైపు హాజరైతే షర్మిల వ్యూహానికి తలొగ్గినట్లు అవుతుందని వారు భావిస్తున్నారు. కార్డుల్లో యలహంక ప్యాలెస్ పేరు ప్రముఖంగా ఉండటంతో, ఇప్పుడు వేదిక మార్చడం కూడా సాధ్యం కాక షర్మిల వేసిన పక్కా ట్రాప్‌లో జగన్, భారతి పూర్తిగా చిక్కుకుపోయారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.











