ఏపీకి షర్మిల… అండగా సునీత..????
ఏపీ రాజకీయాలలో మరో శక్తి ఎంటర్ కానుందా..?? వైఎస్ కుటుంబానికే చెందిన షర్మిల ఇక తెలంగాణలో రాజకీయాలకు గుడ్ బై చెప్పి, ఏపీలో తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధం అవనుందా.?? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు..
తెలంగాణలో సొంత పార్టీ వైఎస్‌ఆర్‌టీపీ పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు జగన్ వదిలిన బాణం వైఎస్ షర్మిల.. ఇక్కడ దాదాపు 4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా ఆశించిన స్పందన తీసుకురావడంలో విఫలం అయ్యారనే వాదన వినిపిస్తోంది.. ఇటు నిధుల లేమి కూడా ఆమెని కలవరపెడుతోంది.. ఇక్కడితో స్వస్తి పలికితే ఆమె రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడుతుందని భావించిందో, లేక ఇతరుల సలహానో తెలియదు కానీ, షర్మిల కాంగ్రెస్‌కి దగ్గరయింది.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే సూచనలు, సలహాలతో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది..
వైఎస్‌ఆర్‌టీపీ కాంగ్రెస్‌లో విలీనం జరిగిన తర్వాత వైఎస్ షర్మిల తన కార్యక్షేత్రాన్ని తెలంగాణ నుండి ఏపీకి మార్చుకోవాలని సూచించారట కాంగ్రెస్ పెద్దలు.. ఇటు, షర్మిల ఎంట్రీని తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. మరోవైపు, కాంగ్రెస్‌కి తీవ్ర షాకులు ఇచ్చిన జగన్‌కి రిటార్ట్ ఇవ్వాలంటే షర్మిలను ఏపీకి పంపితేన బెటర్ అని ఓ నిర్ణయానికి వచ్చిన హైకమాండ్.. ఆమెను ఏపీ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా చేయాలని భావిస్తోందని సమాచారం.
షర్మిల తన రాజకీయ యాక్టివిటీని ఏపీలో పెంచితే అది జగన్‌కి బిగ్ షాక్.. ఆయన కుటుంబం నుండే మరో వ్యక్తి ఇతర పార్టీ నుండి సవాల్ విసిరినట్లు అవుతుంది.. అంతేకాదు, వైసీపీకి హార్డ్ కోర్ ఓటు బ్యాంక్‌గా నిలుస్తోన్న రెడ్డి, ఎస్‌సీ, ఎస్‌టీలతోపాటు క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కూడా కొంతమేరకు చీలిపోవడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలను సైతం ఇదే కలవరపాటుకు గురి చేస్తోంది..
మరోవైపు, షర్మిల ఏపీలో అడుగుపెడితే ఆమె తల్లి విజయమ్మ ఎవరి పక్షం వహిస్తారో అనేది ఆసక్తిగా మారనుంది… ప్రస్తుతం విజయమ్మ కూతురు షర్మిలకి అండగా ఉంటున్నారు.. ఇక, జగన్ చెల్లెలు, సొంత బాబాయ్ వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీత సైతం అన్నపై గుర్రుగా ఉన్నారు.. తన తండ్రిని చంపిన వారిని జగన్ కాపాడుతున్నారని ఆమె భావిస్తున్నారు.. అందుకే, జగన్ సర్కార్‌పై ఆమె న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తున్నారు.. షర్మిల ఏపీలో అడుగుపెడితే, సునీత సైతం ఆమెకే మద్దతు పలకడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ పండితులు.. ఇదే జరిగితే, జగన్‌పై ముప్పేట దాడి మొదలవనుంది.. ఇటు రాజకీయ ప్రత్యర్ధుల నుండే కాకుండా, ఆయన ఫ్యామిలీ నుండి కూడా ఎటాక్ జరగనుంది. మరి, ఏపీ రాజకీయాలలో ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి..