వైస్ షర్మిల ఆ మధ్య తన తండ్రి వైస్సార్ జయంతి సందర్బంగా పులివెందులలోని ఇడుపులపాయకు విచ్చేసిన ఆమె తండ్రికి నివాళులు అర్పించాక, పులివెందులలో పర్యటించారు, పులివెందులలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు, వైస్సార్ హయాంలో చేసిన డెవలప్మెంట్ కనిపిస్తుంది గాని, వైసీపీ ప్రభుత్వం చేసినట్టు పులివెందులలో కనపడటం లేదు అని తన అన్న ముఖ్యమంత్రి జగనమొహం రెడ్డికి చురకలంటించారు షర్మిల. ఇలా సొంత చెల్లెలి సీఎం జగన్ ని నిలదీస్తే సాధారణ ప్రజలు ఊరుకుంటారా? ప్రతిపక్షం ఇంకా చెలరేగుతుంది అని వైసీపీ నాయకులకి భయం పట్టుకుందని సమాచారం. సొంత చెల్లెలే సీఎం సీట్ కిందకి నీళ్లు తెస్తుంది ఏంటా అని వైసీపీ నాయకులలో భయాందోళనలు మొదలైనట్టు తెలుస్తోంది.. షర్మిల తో కొత్త తలనొప్పి మొదలైంది వైసీపీలో.షర్మిల అడుగుతున్నా ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలి అని వైసీపీ నాయకులూ తీవ్ర ఆలోచనలు చేస్తున్నారు తెలుస్తోంది..
ఇదిలా ఉంటె తెలుగు రాజకీయాల్లో మరో కీలక పరిణామం. గత కొంత కాలంగా వైఎస్సార్‌సీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. షర్మిల కూడా అదే సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చే ముందు నేరుగా సోనియాను కలవనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు షర్మిల రాకపై షరతులు పెడుతున్న తరుణంలో నేరుగా సోనియాతో చర్చించాలని షర్మిల నిర్ణయించుకున్నారు.
వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబం కాంగ్రెస్‌కు దూరమైంది. ఇప్పుడు వైఎస్ కూతురు షర్మిల మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 17, 18 తేదీల్లో బెంగళూరులో అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీల జాతీయ స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరుకానున్నారు.. ఈ సమయంలో వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల బెంగళూరులో సోనియాతో భేటీ కానున్నారు. ఈ మేరకు షర్మిల కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి మొదటి నుంచి మధ్యవర్తిత్వం వహిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అపాయింట్‌మెంట్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
షర్మిల పార్టీలో చేరికపై జరిగిన చర్చా సమావేశంలో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తేనే తదుపరి చర్చలుంటాయని షర్మిల భర్తకు కాంగ్రెస్ నేత కెసి వేణుగోపాల్ తెలియజేశారు. ఇప్పుడు సోనియాతో షర్మిల భేటీ సందర్భంగా విలీనానికి అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.