సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాల ప్రచారంతో వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఇందులో సంపూర్ణ మద్య నిషేధం అనేది మధ్యలోనే ఆగిపోయింది. జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టేశారు. ఈ రెండు మినహా మిగతా పథకాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. గతంలో జగన్ నవ రత్నాలు అందిస్తామని పాదయాత్ర సమయంలో చెప్పినపుడు దానిపై ప్రజలు పూర్తి భరోసాతో వైసీపీ కి ఓట్లు వేసి అధఇకారాం కట్టబెట్టారు తీరా చుస్తే, నవరత్నాల పేరు చెప్పి ప్రజలకి నావర్తనం ఆయిల్ పూశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఒత్తి మాటలే అని, చేతల్లో ఎక్కడ కనపడటం లేదు అని ఆంధ్ర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపించారు. టీడీపీ కూడా దూసుకుపోతున్న తరుణంలో జనసేన సైలెంట్ పై ఊహగానాలు విడిచిపెట్టాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ కూసుంపూడి మాట్లాడుతూ.. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని పొత్తులపై అపోహాలు, అనుమానాలు విడనాడాలని కోరారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పొత్తులు ఉంటాయా కొందరు త్యాగాలు చేయాల్సి వస్తుంది తప్పదు అని ఓపెన్ గా చెప్పేసాడు.
ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రణాళిక బద్ధంగా అడుగులు వేస్తున్నారు. రాబోయేది రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ స్వయంగా సీఎం పదవి నాకు అవసరం లేదని, ఎలాగైనా వైసీపీని జగన్ ను సీఎం పదవి నుంచి గద్దె దించాలని కోరుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించారు.
గతంలో సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం కోసం ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు. మూడు రాజధానులు అన్నాడు, ఇప్పుడేమో ఒకే రాజధాని అదికూడా విశాఖ పట్నం ఆంధ్ర రాజధాని అని అనౌన్స్మెంట్ చేసాడు. సామజిక న్యాయం చేస్తాం అన్నాడు ఆ సామజిక న్యాయం ఏ ఒక్క చోట కూడా కనపడటం లేదు. కుల విభజన చేసి కుల రాజకీయాలు చేయడానికి సిద్దమయ్యాడు మన సీఎం జగన్ మోహన్ రెడ్డి. కులాల వారీగా విభజించి, అన్ని ఫలాలు అందేలా చేస్తన్నాడు, భజన సంగతి అటుంచుటే ఫలాలు దేవుడెరుగు అంటున్నారు. ఇప్పుడేమో సంక్షేమం అంటూ చెప్పుకొని తిరుగుతున్నాడు. ఇచ్చినా హామీల్లో ఒక్కటైనా సర్రిగ్గా చేయని ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది అనేది అక్షర సత్యం. మద్యపానం పూర్తిగా నిషేదిస్తాం అని మాటిచ్చిన జగన్, మద్యపానం అమలుతో ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటుంది ఈ ప్రభుత్వం. ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎలెక్షన్స్లో మాత్రం ఫ్యాన్ కి ఉన్న మూడు రెక్కలు ఊడగొట్టి ప్రజలే బుడ్డి చెబుతారనేది పాచి నిజం..!!