YSRCP Is Adopting A Dual Stance On The New Farming Laws :
ఏపీలో అధికారి పార్టీ అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మరోమారు తేలిపోయింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు పార్లమెంటులో మద్దతు పలుకుతున్నట్లుగా ప్రకటించిన వైసీపీ.. ఇప్పుడు అవే చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించింది. ఇలా సభలో ఒకలా, సభ బయట ఒకలా వ్యవహరిస్తూ తన రెండు నాల్కల ధోరణిని అ పార్టీ బయటపెట్టుకుందన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. వెరసి రాష్ట్ర ప్రయోజనాలు, తాను గొప్పగా చెప్పుకునే అన్నదాతల ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలే తనకు ముఖ్యమని వైసీపీ చెప్పకనే చెప్పేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పార్లమెంటు సాక్షిగా మోదీకి మద్దతు
దేశానికి వెన్నెముకగా చెప్పుకునే వ్యవసాయ రంగంలో నూతన సంస్కరణలు అంటూ నరేంద్ర మోదీ స్కారు.. కొత్త సాగు చట్టాలను ప్రతిపాదించింది. ఈ చట్టాలపై స్వయంగా రైతులే రోడ్డెక్కారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చుని నెలల తరబడి ఉద్యమాలు సాగిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల్లో చాలా పార్టీలు కొత్త సాగు చట్టాలను వ్యతిరేంచాయి. అన్నింటికీ మించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగిన శిరోమణి అకాలీదళ్.. కొత్త సాగు చట్టాలకు నిరసనగా తనకు దక్కిన మంత్రి పదవిని వదులకుని.. కూటమి నుంచి బయటకు వచ్చేసింది. దీంతో కొత్త సాగు చట్టాల పేరిట మోదీ సర్కారు రైతుల మెడకు ఉరి బిగిస్తోందని తేలిపోయింది. అయితే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి నిరసన వ్యకమైతే.. వైసీపీ మాత్రం ఆ చట్టాలకు పార్లమెంటులో మద్దతు పలికింది. ఈ సందర్భంగా నూతన సాగు చట్టాలను ఆహ్వానిస్తూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత.. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకించే వారంతా దళారులేనని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు యావత్తు దేశాన్నే నివ్వెరపరిచన వైనం కూడా మరువలేనిదే.
భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు
ఇదిలా ఉంటే నూతన సాగు చట్టాలను వ్యతిరేస్తూ అలుపెరగని ఉద్యమం సాగిస్తున్న రైతు సంఘాలు.. సోమవారం నాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు పలు రాజకీయ పార్టీలతో పాటు దాదాపుగా అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. వైసీపీ వైఖరి ప్రకారంగా ఆ పార్టీ ఈ ఆందోళనలకు మద్దతు పలకకూడదు. అయితే అందుకు భిన్నంగా పార్లమెంటులో తాను వ్యవహరించిన వైఖరిని దాచిపెట్టేసి.. భారత్ బంద్ కు వైసీపీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఫలితంగా ఏపీలో భారత్ బంద్ సంపూర్ణంగానే సాగుతోంది. ఇలా పార్లమెంటులో నూతన సాగు చట్టాలకు మద్దతు పలుకుతూ సంచలన వ్యాఖ్యలు వైసీపీ.. ఇప్పుడు అవే చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న భారత్ బంద్ కు మద్దతు ఇవ్వడం చూస్తుంటే.. అన్నదాతల సంక్షేమం విషయంలో వైసీపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నట్లే కదా. దీనిపై వైసీపీ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి మరి.
Must Read ;- దుగ్గిరాల వైసీపీదేనా?.. టీడీపీ వదిలేస్తుందా?











