సాధారణంగా ప్రతిపక్షంలో ఏం ఉంటాంలే.. అధికార పక్షమైతే ఎన్నో ఉపయోగాలు అనుకుంటారు కొందరు నాయకులు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉంటే వేధింపులు తప్పడం లేదు, పైగా నిరాదారంగా ఆరోపణలు, కేసులు అంటూ పోలీసలు వెంటపడుతుంటారు. ఇలాంటి ఆలోచనలతో కొందరు సమస్యలను ఎదుర్కోలేక అధికార పక్షానికి దాసోహం అంటారు. అలాంటి పరిస్థితులు నెలకొంటున్న సమయంలో అధికార పక్ష నాయకుడు, సోమశిల పాజెక్ట్ కమిటీ మాజీ ఛైర్మన్ కండ్లగుంట్ల మధుబాబు టీడీపీలో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
లోకేష్ సమక్షంలో చేరిక
మధుబాబు టీడీపీ నేత నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండవా కప్పి మధుబాబును ఆహ్వానించారు లోకేష్. ఈ సందర్భంగా లోకేష్ ప్రతిపక్ష అరాచకాల గురించి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మెల్లగా మార్పు మొదలైందని, అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా, కావలికి చెందిన మధుబాబు చేరిక అందుకు నిదర్శనం అని తెలియజేశారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీ కోసం పాటుపడతానని తెలియజేశారు. మధుబాబుతోపాటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు కూడా అధికార పక్షాన్ని వీడి ప్రతిపక్ష గూటికి చేరారు. దీనిపై కావలి ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.
మార్పు మొదలైంది
పెను మార్పుకైనా మొదట అడుగుతోనే శ్రీకారం చుడతాం. అధికార పక్షం వేధింపులకు పాల్పడుతుందని తెలిసి కూడా ప్రతిపక్షంలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారంటే అధికార పార్టీలో నేతల దుస్థితి తేటతెల్లం అవుతుంది. అంతేకాదు, అధికార ఏకపక్ష నిర్ణయాల కారణంగా కొందరు ప్రజలకు సమాధానాలు చెప్పలేక పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలోనే అధికార పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే కొట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. పార్టీలోని లుకలుకలు జగన్ బెంచ్ కి పంచాయితీకి కూడా వెళ్లింది. అధికార పార్టీ కూడా కొందరికి ప్రాధాన్యం ఇవ్వడం మరికొందరికి ఇవ్వకపోవడం లాంటివి కూడా చేస్తుంది. ఇలాంటి ఎన్నో కారణాలు అధికారలో చీలికలకు కారణమవుతుందనేది నిజం. నివురుగప్పన నిప్పులా ఉంది పరిస్థితి అని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఏ క్షణమైన ముఖ్య నేతల నుండి కార్యకర్తల వరకు పార్టీపై రెబల్ జెండా ఎగరేయం మాత్రం ఖాయం అనిపిస్తుంది.
Must Read ;- ప్రాణం పోయినా పార్టీ వీడను : అశోక్ గజపతి రాజు