టీడీపీకి ఓటేస్తే అంతు చూస్తామంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఏపీ లీగల్ సెల్ కార్యదర్శి మొదలవలస చిరంజీవి ఓటర్లను హెచ్చరించారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థికి ఓటేస్తే పింఛన్లు, అమ్మ ఒడి కట్ చేస్తామని హెచ్చరించారు. తానే ఎంపీపీని కాబోతున్నానని, ఒకవేళ టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలిచినా రెండు నెలల్లో చెక్ పవర్ తీసేస్తానంటూ చిరంజీవి బెదిరింపులకు దిగారు. వాడు గెలిచినా సర్పంచ్‌గా ఉండడని టీడీపీ అభ్యర్థిని ఉద్దేశించి అన్నారు. వైసీపీ బలపర్చిన అభ్యర్థికి ఓట్లు వేయకపోతే 21 తర్వాత మీ అంతు చూస్తానంటూ బహిరంగంగానే చిరంజీవి హెచ్చరించారు.
దాడులు.. బెదిరింపులే వారి బలం..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాగే అనేక ప్రాంతాల్లో ఏకగ్రీవాలయ్యాయి. ఈ ఏకగ్రీవాల్లో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెదిరింపులకు పాల్పడి, ప్రలోభ పెట్టి ఏకగ్రీవాలు చేశారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గాలు గతంలో ఎప్పుడూ జరగలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు ఓటేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం ప్రస్వామ్యంలో సరికాదని విమర్శిస్తున్నారు. ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా.. ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు.
Must Read ;- ఏకగ్రీవాలు విత్ హెల్డ్.. ఫిర్యాదులపై ఎస్ఈసీ విచారణ