జగన్ అన్నా.. మమ్మల్ని వదిలేయండి.. మేము బయటకి రాలేము.. పరిస్థితులు పార్టీకి చాలా కష్టంగా ఉన్నాయి.. కొంతకాలం వరకు మమ్మల్ని టచ్ చేయకండి ప్లీజ్… ఇదీ ఓ జిల్లా నేతలు వైసీపీ అధినేత జగన్‌కి రాసుకున్న లేఖగా చెబుతున్నాయి రాజకీయ వర్గాలు.. కేవలం 11 స్థానాలకే పరిమితం అయిన పార్టీకి మళ్లీ జవసత్వాలు కూడదీయాలంటే భారీ ప్రణాళిక, ఆర్ధిక వనరులు కావాలి.. ఇటు, టీడీపీ వ్యూహాలను కౌంటర్ చేసుకుంటూ పోరాటం చేయాలి… ఇది సాధారణ విషయం కాదు. అధికారం ఉన్న అయిదేళ్లు రాష్ట్రానికి, ప్రజలకి జగన్ చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.. ముఖ్యమంత్రిగా జగన్ చేసిన క్షమించలేని తప్పులను.. అప్పుడే మరిచిపోలేదని అంచనా వేసుకున్న ఆ జిల్లా నేతలు, పార్టీకి ఝలక్ ఇచ్చారట..
ఈ విషయం వైసీపీ నేతలకు కూడా బాగా తెలుసు. అందుకే, ఓ జిల్లాకి చెందిన కీలక నేతలంతా కలిసి ఆ పార్టీ అధినేత జగన్‌కి ఓ ఉమ్మడి లేఖ సమర్పించారట.. పార్టీ తరఫున పోరాడేందుకు తమకు కొంత సమయం కావాలని.. ఇప్పటికిప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదని వారు కుండబద్దలు కొట్టి చెప్పినట్టు సమాచారం. ప్రజల మధ్యకు వెళ్లేందుకు చాలానే సమయం ఉందని.. ప్రస్తుతం ఇంకా కూటమి సర్కారుపై మనం అనుకుంటున్న స్థాయిలో వ్యతిరేకత పెల్లుబుకలేదని కూడా వారు జగన్‌కి విన్నవించారట.. ఈ లెటర్ రాసిన జిల్లా నేతలు ఎవరు..? ఏ జిల్లా నేతలు..? అనేవి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు వైసీపీ నేతలు..
ఈ లేఖ చూసిన జగన్ బిత్తరపోయారని సమాచారం.. మరోవైపు, గ్రౌండ్‌లో తాజా పరిస్థితిని తమ పార్టీ నేతలు బాగానే అంచనా వేస్తున్నారని జగన్ టీమ్ భావించారని తెలుస్తోంది.. అందుకే, ఫీజు పేరుతో ప్రభుత్వంపై పోరాడడానికి జగన్.. గత నెల రోజుల గ్యాప్‌లోనే ఏకంగా మూడు సార్లు పిలుపునిచ్చారు.. కానీ, దానిని మూడుసార్లు వాయిదా వేసుకున్నారు.. ఫిబ్రవరి మొదటివారంలో జరపాలని నిర్ణయించిన ఫీజు పోరుని జగన్…. మార్చి రెండో వారానికి పోస్ట్‌పోన్ చేసుకున్నారు.. ప్రజలలో అంతగా వ్యతిరేకత రాకపోవడం, కూటమి సర్కార్ విద్యార్ధులకి ఫీజులు సక్రమంగా, సకాలంలో చెల్లించడమే ఈ వాయిదాకి కారణంగా చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు..
జగన్ హయంలో గాడి తప్పిన విద్యావ్యవస్థని పట్టాలెక్కించడానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేయని ప్రయత్నం లేదు.. పట్టు తప్పిన వ్యవస్థలో ఇప్పుడిప్పుడే సంస్కరణలు అమలు చేస్తున్నారు యువ మంత్రి లోకేష్.. ఇవి సత్ఫలితాలను ఇస్తున్నాయి.. ఈ అంశాలను బేరీజు వేసుకి జగన్ తన ఫీజు పోరును వాయిదా వేసుకున్నారు..
మొత్తమ్మీద, గత ఎన్నికలకు ముందు అంతెత్తున ఎదిగిన వైసీపీ నేతలు.. ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకుంటున్నారు.. కూటమి సర్కార్‌పై వ్యతిరేకత అంతగా లేదని గ్రామ సర్పంచ్ నుండి అధినేత వరకు వస్తున్న అంచనా.. మరి, ఈ పరిస్థితులను జగన్ ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటారో, ఎలాంటి కుయుక్తులు పన్నుతారో చూడాలి..