బటన్ నొక్కి డబ్బులేస్తే సరిపొద్ది.. ఇక పార్టీ కేడర్ తో పనిలేదన్న భావనలో జగన్ రెడ్డి ఉన్నారు కాబట్టే వైసీపీలో కొత్త ముసలం మొదలైందని విశ్లేషణలు ఊపందుకున్నాయి.
జగన్ రెడ్డి పార్టీలో కొత్త ములసం పుట్టుకొచ్చింది. పొమ్మనలేక పొగపెడుతున్నారో.. లేక కావాలనే డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారో కానీ.. అధికార వైసీపీలో వైరాగ్యం తన్నుకొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్నా.., నిన్నటి వరకు బాలినేనికి వెర్రెక్కి నోటికి ఏదొస్తే అది మాట్లాడారు అని అందరూ భావించారు. కానీ.., నేడు దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా ఏపీ వైపు చూసేలా.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా చేసి వార్తల్లో నిలిచారు. వై నాట్ 175 అన్న జగన్ రెడ్డికి నేడు పార్టీ నేతలు.., సర్వేలు ఇస్తున్న షాకులకు మాటలు రావడం లేదు. మైండ్ కూడా పనిచేయని పరిస్ధితి. ఈ దుస్ధితికి కారణం ఏమిటి అని విశ్లేషించుకుంటే.. అన్నీ వేళ్లు జగన్ రెడ్డి వైపే చూపుతున్నాయి.
తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే సరిపొద్దన్న భ్రమల్లో ఉన్నారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో వాలంటీర్లే పార్టీ సైనికులుగా భావించి.., ఎక్కిన కొమ్మను నరుక్కునే విధానాలు సాగించారు జగన్. ఈ ఒంటెద్దు పొకడలే రాజకీయంగా ఇంటా బయట జుగుప్స కలిగిస్తున్నాయి. అందుకే సొంతవారు.., అందులో అత్యంత సన్నిహితులు అనుకున్న ఎమ్మెల్యేలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. వాలంటీర్లుకిచ్చే ప్రాధాన్యత కనీసం ఎమ్మెల్యేల కూడా ఇవ్వడం లేదు అన్నది వైసీపీ ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్ ల వరకు వినిపిస్తున్న విమర్శలు. ఇదే వైసీపీలో కొత్త ములసం పుట్టేందుకు ఆజ్యం పోసిందని విశ్లేషణలు ఊపందుకున్నాయి.
మొత్తంగా జగన్ రెడ్డి పాలన విధానాలు.., సొంత ఎమ్మెల్యే పట్ల వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. రాజకీయం ఫార్టి ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు సైతం జగన్ చర్యలు తట్టుకోలేక.., తలలు పట్టుకుని అవమాన భారంతో పార్టీ వీడిన దూరంగా జరుగుతున్నారు. సీనియర్లు వంతు ముగిసి.., నేడు అత్యంత సన్నిహిత వర్గాల వంతు వచ్చింది. ఇదే వైసీపీలో నడుస్తున్న రాజకీయం. మరోవైపు సర్వేలు లెక్కలు చూపి.., సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు లేవని జగన్ రెడ్డి చేస్తున్న ఎమోషనల్ బ్లాక్ మెయిల్ విధానం పార్టీలో తలనొప్పిగా మారింది.
ఇక వత్తిడిని భరించలేకే పార్టీలోని సీనియర్లు.., అత్యంత సన్నితులుగా మెలిగే ఎమ్మెల్యేలు వైసీపీని వీడి కొత్త దారులు వెతుక్కుంటున్నారని చర్చ నడుస్తోంది.











