వైసీపీ పాలనలో కబ్జాలకు హద్దు , అదుపు లేకుండా పోతుంది .. ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ నేతలు ఇదే పనిలో ఉన్నారు .ఇక కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టు సొంత పార్టీ నేతల జాగాలు కూడా కబ్జా చేసేస్తున్నారు .. కాలి జాగా వేసేయ్ పాగా అన్న తరహాలో వైసీపీ నేతల కబ్జాలు చేస్తున్నారు .. ఇవి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు సాగుతున్నాయి .
వైసీపీ దొంగల కబ్జాకు కాదేది అనర్హం, డ్రెయిన్లను కూడా వదలని వైసీపీ బకాసురులు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తాజాగానే అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, డ్రెయిన్లను సైతం వదలకుండా మింగేస్తున్నారని, అందుకు సీఎం జగన్ తాడేపల్లి సిద్ధాంతాలే కారణమంటూ సెటైర్లు కూడా వేశారు. లోకేష్ విమర్శలు చేసి గంటలైనా గడవకముందే వైసీపీ నేత భూమి కబ్జా కావడం … ప్రస్తుత పాలనలో కబ్జాల తీరు ఏ రేంజ్ లో ఉందొ స్పష్టం అవుతుంది .. తాజాగా టీడీపీ కడప లోక్‌సభ
ఇన్ ఛార్జ్ ఆర్.శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వంలో కబ్జాల తీరు ఎలా ఉంటుందో స్పష్టం చేస్తుంది .
తాజాగా అయన కడప జిల్లాలో సాగుతున్న సబ్జాల గుట్టు విప్పారు .. అక్రమ లే-అవుట్లలో స్థలాలు కొనవద్దని ప్రజలని హెచ్చరించారు .. . ఒకవేళ ఎవరైనా తెలియక కొంటే నష్టపోవడం ఖాయమని స్పష్టం చేశారు . తాము అధికారంలోకి వస్తే అక్రమ లేఅవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు కడప నగరంలో చోటు చేసుకున్న అక్రమ లేఅవుట్ల గుట్ట కూడా అయన బయటపెట్టారు ..ఈ క్రమంలో ఏకంగా వైసీపీ బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ ప్లాట్‌ను కూడా కబ్జాకి గురి కావడం సంచలనంగా మారింది
తాజాగా దీనిపై టీడీపీ కడప లోక్‌సభ ఇన్ ఛార్జ్ ఆర్.శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ .. కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో బద్వేలు ఎమ్మెల్యేఫ్లాట్‌ను కబ్జా చేసి అమ్మేశారని .. సంచలన వ్యాఖ్యాకులు చేశారు. ప్రజా ప్రతినిధుల స్థలాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
కడపలో దొంగ డాక్యుమెంట్లతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని శ్రీనివాసరెడీ మండి పడ్డారు. భూకబ్జాలు, అక్రమ లే-అవుట్ల నిర్మాణంలో కడప ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్ల హస్తం వుందని అయన ఆరోపించారు.
కడపలో సాయిమిత్ర డెవెలపర్స్ పేరు మీద 90 వేల గజాలకు మాత్రమే అధికారిక అనుమతి ఉందని … కానీ, కడపలో నాలుగేళ్లలో వందల వెంచర్లు, అక్రమ లేఔట్లు వచ్చాయని ..ఇది ఎలా సాధ్యమని అయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు .. కడప నగరంలో మినిస్టర్ లేఅవుట్ పేరుతో అనుమతిలేని లేఅవుట్ సృష్టించారని అయన చెప్పుకొచ్చారు .. ప్రైవేట్ భూమి కొని, పక్కనే వున్న ప్రభుత్వ భూమిని కొట్టేశారని ఆరోపించారు. ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే అమ్మకానికి పెట్టారని .. . ప్రజలెవరూ ఇలాంటి స్థలాలు, లేఅవుట్లు, భూములు కొనద్దని శ్రీనివాసులరెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు కడప నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ లేఅవుట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. . కడప ప్రజలు తమ ఆస్తులు, భూములు, ఖాళీ స్థలాలు ఉన్నాయో లేదో తరచూ చూసుకోవాలని ఆయన విన్నవించారు. ఇక సీఎం సొంత జిల్లాలో ఈ స్థాయిలో సాగుతున్న భూ కబ్జాలపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు .. ఇది ఇలానే కొనసాగితే ..కడపలో స్థలాలు కొనడమే కష్టమైపోతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంకి పెళ్ళి..సుబ్బి చావు..!
చంద్రబాబు అరెస్టు..! ఆంధ్రా..తెలంగాణా..కర్నాటక..తమిళనాడు బరస్డు..! ఐటీ ఉద్యోగుల నిరసన..మగువల తెగువ..! యన్ ఆర్...