వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో ఎవరు ఎటు ఓటు వేశారో స్పష్టంగా తెలిసిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ఎన్నికల తరవాత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏకగ్రీవం చేసుకోవాలని, లేదంటే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన వినుకొండలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హెచ్చరికలు జారీ చేశారు. బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
బ్రహ్మనాయుడుపై చర్యలు తీసుకోవాలి
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వైసీపీకి ఓటు వేయకపోతే తెలసిపోతుందని, తరవాత అలాంటి వారు గ్రామాల్లో తిరగడం కష్టమని బ్రహ్మనాయుడు హెచ్చరికలు జారీ చేయడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే ఆలోచన వారికి లేనట్టు కనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బ్రహ్మనాయుడు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామని ప్రతిపక్ష నాయకులు వెల్లడించారు.
Must Read ;- కేంద్రం, గవర్నర్‌లకు సిబ్బంది ఏర్పాటు బాధ్యత..