ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని గంటల ముందు వైసీపీ అభ్యర్ధులను ప్రకటించారు సీఎం జగన్. 175 అసెంబ్లీ స్థానాలు, 24 ఎంపీ సీట్ల నుంచి పార్టీ టికెట్‌పై బరిలోకి దిగే వాళ్ల పేర్లు విడుదల చేశారు. సరైన అభ్యర్ధల ఎంపిక కోసం భారీ కసరత్తు చేసి 13 జాబితాలు విడుదల చేసింది పార్టీ హైకమాండ్. కొత్త లిస్టు వచ్చిన ప్రతిసారీ అభ్యర్ధులు మారిపోతూ వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్‌లో జరిగిన వేలం పాటలు, బేరసారాల కారణంగానే ఇన్ని మార్పులు జరిగాయనే వార్త బయటకు వచ్చింది. వైసీపీ వారి వేలం పాటలో.. ఎవరు ఎంత వరకూ వెళ్లారు.. ఏ సీటుకు ఎంత రేటు పలికింది.. పట్టుదలతో రేట్లు పెంచిందెవరు.. మావల్ల కాదని చేతులెత్తేసింది ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి..
ఏపీలో రాజకీయాలు చాలా ఖరీదైన వ్యవహారంలా మారిపోయాయి. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, టీవీ యాడ్స్, సోషల్ మీడియా టీమ్స్ అంటే అభ్యర్ధులకు తడిసి మోపెడవుతోంది. ఆ స్థాయిలో ఖర్చుపెట్టే నాయకులకే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాయి ప్రధాన పార్టీలు. ఈ విషయంలో వైసీపీ ఒకడుగు ముందే ఉంది. పార్టీ నుంచి పోటీ చేయాలంటే ఎంపీ సీటుకైతే ఒక మొత్తం.. ఎమ్మెల్యే స్థానానికి ఒక రేటు ఫిక్స్ చేసేశారట. సరాసరి ఒక్కో అసెంబ్లీ స్థానంలో కనీసం 20 కోట్లు ఖర్చు పెట్టాలనే కండిషన్ పెడుతున్నారు. జేబుకు భారీ చిల్లు పెట్టుకోవడంతో పాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌లను నీచంగా తిట్టడం అనేది వైసీపీ అభ్యర్ధులకు ఉండాల్సిన అదనపు క్వాలిఫికేషన్.
డబ్బులున్నా దిగజారి రాజకీయాలు చేయలేమని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మానుగుంట మహీధర్‌రెడ్డి వంటి నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. నెల్లూరు ఇంఛార్జ్‌గా ఉన్న వేమిరెడ్డి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో ఇంకెవరూ దొరక్క ఇప్పటి వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి విజయసాయిరెడ్డిని బరిలోకి దించారు. పక్కనే ఉన్న ఒంగోలులో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టికెట్ చింపేశారు వైసీపీ అధినేత జగన్. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత ఒత్తిడి చేసినా మాగుంట తప్ప ఇంకెవరైనా ఓకే అని చెప్పారు. ఒంగోలు నుంచి పోటీకి చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆసక్తి చూపడంతో.. 140 కోట్లు డిపాజిట్ చేయాలని ఆయనకు కండిషన్ పెట్టారట. అంటే ఒక్కో అసెంబ్లీ స్థానానికి 20 కోట్లు ఖర్చు చేయాలన్న మాట. చెన్నై పార్టీ తటపటాయించడంతో రేటును క్రమంగా తగ్గించుకొంటూ పోయారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు. 140 కాస్త 120కి తగ్గింది. ఆ తర్వాత 80కి వెళ్లింది చివరికి 30 కోట్లు ఇచ్చినా టికెట్ కన్‌షర్మ్ చేస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారట. తాడేపల్లి వేలం పాట రివర్స్‌లో వెళ్లడంతో.. వైసీపీ టికెట్‌కి డిమాండ్ లేదని అర్ధమైపోయింది. ఇంకేముంది చెన్నై బిజినెస్‌మ్యాన్ సైలెంట్‌గా సైడ్ అయిపోయాడు. చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ దక్కింది.
నెల్లూరు, ఒంగోలు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి ఎంపీగా చేయడానికి పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. భారీ ఖర్చు పెట్టుకున్నా గెలుస్తామనే నమ్మకం లేదు.. గెలిచినా ఉపయోగం ఏంటి అనుకొని.. ఫ్యాన్ గుర్తుపై పోటీకి వెనకడుగు వేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఖర్చుకు భయపడే విశాఖ తూర్పు సీటు తీసుకొని అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మార్గాని భరత్, వంగా గీత కూడా అదే బాటలో సిట్టింగ్ సీటు వదిలేసి శాసనసభ బరిలో నిల్చున్నారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌లకు బలవంతంగా ఎంపీ సీట్లు అంటగట్టింది వైసీపీ అధిష్టానం. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలు గెలిస్తే.. వారిలో ఏడుగురు మాత్రమే మళ్లీ పోటీ చేస్తున్నారు.
వ్యతిరేకత పేరుతో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ హైకమాండ్ టికెట్లు నిరాకరించింది. మరో 15 మందిని వేరే స్థానాలకు బదిలీ చేయగా ఆరుగురు వారసులకు అవకాశం కల్పించారు. సగం స్థానాల్లో అభ్యర్ధులను మార్చామని గొప్పలు చెప్పుకొంటున్నా.. వాస్తవానికి టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు 25 మంది మాత్రమే. అవి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల్లోనే ఎక్కువగా మార్పులు, బదిలీలు జరిగాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ఊదరగొట్టే జగన్‌రెడ్డి.. ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసే విషయంలో మాత్రం పెద్ద హ్యాండ్ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి 49 సీట్లు దక్కితే.. బీసీలకు 48 సీట్లు మాత్రమే కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌డ్ స్థానాలు మినహా అదనంగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అయినా బడుగు బలహీన వర్గాలను ఉద్దరించేసినట్లు భారీ బిల్డప్ ఇచ్చారు వైసీపీ అధినేత.