నిన్నమొన్నటిదాకా వైసీపీలో నెంబర్ టు ఎవరంటే.. లీడర్స్ నుండి కేడర్ వరకు వినిపించే ఒకే ఒక్క పదం.. విజయ సాయి రెడ్డి.. బూతు స్థాయి కార్యకర్త నుండి టాప్ లీడర్ వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటే నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు.. అంతేకాదు, గత ఎన్నికలకు ముందు వైసీపీ సోషల్ మీడియా వింగ్ మొత్తాన్ని తన కనుసన్న్లల్లో నడిపించారు విజయసాయి రెడ్డి.. పార్టీలో అంతర్గతంగా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, గత కొంతకాలంగా ఆయన సైలెంట్ గా ఉంటున్నారు.. ఇటీవల వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, రాజకీయ వారసుడు నారా లోకేష్ పై ట్విట్టర్ లో విరుచుకుపడిన విజయసాయి.. రీసెంట్ గా ఒక్క ట్వీట్ చేయడం లేదు..
ఈ ఇద్దరిపైనే కాదు, టీడీపీపై కూడా ఆయన వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు.. వైసీపీ సోషల్ మీడియా వింగ్ ని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి నడిపిస్తున్నారు.. విజయసాయి రెడ్డి ఐడియాస్, క్రియేటివిటీ, టీమ్ ని నడిపించడం, నాయకత్వం, సమర్ధత ముందు సజ్జల భార్గవ్ రెడ్డి తేలిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. స్వయంగా ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారుతోంది..
ఇదంతా ఒక ఎత్తయితే, తాజాగా విజయసాయి రెడ్డి తన ట్విట్టర్, ఫేస్ బుక్ తో పాటు ఇతర సామాజిక ప్లాట్ ఫామ్ లలో పెడుతున్న పోస్టులు పార్టీ కార్యకర్తలలో ఆత్మస్థయిర్యాన్ని కోల్పోయేలా చేస్తున్నాయనే చర్చ సాగుతోంది.. శనివారం ఉదయం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన రెండు పోస్టులు వారి మైండ్ బ్లాంక్ చేశాయి..
ఒకటి బుద్ధ భగవానుడి బోధనల గురించి, మరొకటి హిందూ మహాసముద్రంలో చైనా నౌకలని ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్.. ఈ రెండు పోస్టులు హిందీలో పోస్ట్ చేయడం విశేషం.. ఏపీ రాజకీయాలపై విజయసాయి రెడ్డి మౌనం పాటిస్తున్నారు.. పూర్తిగా పొలిటికల్ పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది.. విజయసాయిరెడ్డి మారిన వైఖరి గమనిస్తుంటే… పార్టీలోని కొందరు నేతలతో ఆయనకు గ్యాప్ వచ్చిందని అర్ధం అవుతోందని చెబుతున్నారు ఎనలిస్టులు.. ఈ అంశంలో చాలా పట్టుదలతో ఉన్నారనే అభిప్రాయం కలుగుతోంది. కనీసం ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలకు విజయసాయిరెడ్డి దూరంగా ఉన్నారు. హైకమాండ్ లోని కొందరు నేతల రాజకీయాలపై విరక్తి చెంది వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారని లీకులిస్తున్నారు ఆయన సన్నిహితులు.. ఇదే ఇప్పుడు వైసీపీ కేడర్ ని డైలమాలో పడేస్తున్నాయి..
మరోవైపు, విజయసాయి రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. తారకరత్న భార్య అఖిలా రెడ్డి కోసమే ఆయన చంద్రబాబు, బాలయ్య బాబుతో క్లోజ్ గా ఉన్నారని చెబుతున్నా, వైసీపీలో ఏదో జరిగిందనే చర్చ నడుస్తోంది.. మరి, విజయసాయి రెడ్డి మౌనం.. వైసీపీకి ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా..?. అనేది చూడాలి..