మంత్రివర్గ విస్తరణ అధికార వైసీపీలో అగ్గిరాజేస్తోందా ? సిఎం జగన్ వ్యాఖ్యల తో వైకాపాలో చీలికలు మొదలయ్యాయా? సీనియర్ లలో అసంతృప్తికి కారణం ఏమిటి ? ప్రస్తుత మంత్రులు తెరపైకి తెస్తున్న డిమాండ్ లు ఏంటి ? క్యాబినెట్ కూర్పు విషయంలో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టిస్తున్న అంశాలేంటి ? ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన హాట్ టాపిక్ గా మారింది.గత కొన్ని రోజులుగా మంత్రివర్గ విస్తరణ జరగబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ చర్చతో ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిలో పదవీ భయం పట్టుకుందట.దీనికి సిఎం జగన్ చేసిన వ్యాఖ్యలే కారణమని టాక్. నిజానికి రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని బర్తరఫ్ చేసి కొత్త క్యాబినెట్ ని నెలకొల్పుతానని సిఎం జగన్ తన తొలి మంత్రివర్గ సమావేశంలోనే చెప్పాడు.అయితే పనితీరు ఆదారంగా ఉన్న మంత్రుల పదవీకాలం సోహం పూర్తి అయ్యాక మార్పులు ఉంటాయని జగన్ మొదట చెప్పారు. కొంతకాలం తర్వాత ఉన్న క్యాబినెట్ మొత్తన్ని మార్చేసి సీనియర్ లను మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ సంకేతాలు పంపారట. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఒకరిద్దరు తప్ప మంత్రి వర్గం నుంచి మిగిలిన వారందరినీ తొలగించబోతున్నట్లు సిఎం జగన్ స్వయంగా తెలిపారు. దీంతో అధికార పార్టీ నేతల్లో మంత్రివర్గ విస్తరణ అంశం అగ్గి రాజేసిందనే చర్చ వైసీపీ వర్గాలలో వినిపిస్తోందట. అధినేత జగన్ నిర్ణయంతో సీనియర్ మంత్రుల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయంట. ఒకరిద్దరిని ఉంచి మిగితా వారిని తొలగిస్తామనడం పై వారు కస్సుమంటున్నారట. కొందరిని మాత్రం మంత్రివర్గంలో ఉంచి మిగితా వారిని తొలగిస్తే వారిపై అసమర్ధ ముద్ర పడుతుందని.. ఈ నేపధ్యంలో ఇది తమకు ఆమోదయోగ్యం కాదని అంటున్నారట.ఈ క్రమంలోనే ఉంచితే అందరినీ ఉంచండి, లేదా అందరినీ తొలగించండి అంటూ అధిష్టానానికి ప్రస్తుత మంత్రుల్లోని ఓ వర్గం తెగేసి చెబుతున్నారట. ఇదిలా ఉంటే సీనియర్ మంత్రుల డిమాండ్ లు సైతం వైకాపా హై కమాండ్ కి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయట.ఇద్దరు మంత్రులు ఉన్న జిల్లాల్లో ఒకరిని తొలగించి మరొకరిని కొనసాగిస్తే అది తమకు రాజకీయంగా ఇబ్బందికరమని కొందరు నేతలు పేర్కొంటున్నారట.మరి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న సీనియర్ లను మిమ్మల్ని తొలగిస్తున్నాం, మీ జిల్లాలో ఎవరికి అవకాశం ఇవ్వాలి చెప్పండి అంటూ సంకేతాలు పంపడం పై వారంతా మండిపడుతున్నారట. తమని తొలగించి, మళ్ళీ తమ అభిప్రాయంతో మరొకరికి మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని పెదవి విరుస్తున్నారట. కాగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ ప్రక్షాళన పై ఇప్పటికీ ఒక స్పష్టత మాత్రం రానట్లుగానే కనిపిస్తోంది.ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల ప్లీనరీ సమావేశంలో క్యాబినెట్ కూర్పు త్వరలోనే ఉంటుందని సిఎం జగన్ స్వయంగా చెప్పినప్పటికీ తేదీ మాత్రం ఖరారు చేయలేదు. అదేసమయంలో ఏప్రిల్ 9 న లేదా 11 వ తేదీన కొత్త మంత్రివర్గం కొలువు తీరబోతోందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో క్యాబినెట్ లో బెర్త్ పై ఆశలు పెట్టుకున్న ఆశావాహులలో అసంతృప్తి వ్యక్తమవుతుండగా.. ఇంకెంతకాలం కాబోయే మాజీలుగా కొనసాగాలనే అసహనం ప్రస్తుత మంత్రుల్లో నెలకొందట. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ అంశంలో సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్న వ్యతిరేకత వైసీపీ అధిష్టానానికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయో వేచి చూడాల్సిందే. Must Read:-వైసీపీ నేత వేధింపులు తట్టుకోలేక వీఓఎల సంఘం మండల అధ్యక్షురాలు ఆత్మహత్య