కాంగ్రెస్ పార్టీలో విలువలు గల నాయకుల్లో ఒకరిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు రాష్ట్రపతి పదవిని అలంకరించిన వ్యక్తిగా దేశంలో ఎంతో మంది అభిమానుల్ని కలిగి ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. కొన్ని రోజులుగా కొవిడ్ సోకడంతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు అని ఆస్పత్రి వర్గాలు తెలియజేశాయి.
ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్ పైనే ప్రణబ్ చికిత్స పొందుతున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పర్యవేక్షిస్తున్నదని తెలిపారు.
మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న ప్రణబ్‌కు ఆర్మీ ఆసుపత్రిలోనే క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. కరోనా పాజిటివ్ సహా అనారోగ్య సమస్యలతో 15 రోజులుగా ప్రణబ్ ముఖర్జీ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్నారు.











