ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఆరోగ్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీనిపై నిన్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి.., కొడలు బ్రహ్మణి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని ఆరోపించారు. ఉదయం హుటాహుటిన ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చారు లోకేష్.
డ్రీ హైడ్రేషన్.., చర్మంపై దద్దుర్లు.., అమాంత బరువు తగ్గిపోవడం వంటివి జైల్లో చంద్రబాబును వేదిస్తున్న ఆరోగ్య సమస్యలు. మాజీముఖ్యమంత్రి.., నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఆరోగ్య పరంగా గతంలో ఎన్నడూ ఎదుర్కొని క్లిష్ట పరిస్ధితిని జైల్లో ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం డెంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుదేశం నేతలు, జనసేన నాయకులు ఆందోళన బాటపట్టారు.
చంద్రబాబుకు మద్దుతుగా హైదరాబాద్ లో పార్టీ అభిమానులు లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వకు నల్ల టీ- షర్డులు ధరించి మెట్రలో ప్రయాణం చేస్తూ నిరసనలు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి చంద్రాబాబు అక్రమ అరెస్ట్ ను ఖండించారు. సంఘీభావం తెలిపి..ఆయను మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. ఈ నేపధ్యంలో తెలంగాణ పోలీసులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిని అడ్డుకున్నారు. మెట్ల మార్గాలను .., టికెట్ కౌంటర్లును మూసివేశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అలానే మరోవైపు తిరుపతిలో ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న జగసేన వీర మహిళలపై 307 కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే సుగణమ్మ ఆరోపించారు. చంద్రబాబును కాపోడుకోవడం అందరి బాధ్యత అని జనసేన.., సీపీఐతో కలిసి తెలుగు దేశం వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తోంది. చంద్రబాబుకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను గవర్నర్ వివరిస్తామని.., వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.