గత 35 రోజులుగా స్కిల్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం గత మూడు రోజులుగా పతక స్థాయిలో క్షీణించింది. ఆయన భారీగా బరువు తగ్గి నీరసించిపోయారు. దాదాపు 5 కేజీలు బరువు తగ్గిన చంద్రబాబు మరో 2 కిలోలు తగ్గిపోతే ఆయన కిడ్నీలు తీవ్రస్ధాయిలో పాడై పోయే ప్రమాదం ఉందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక జైల్లో ఉన్న వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు క్లోరినేషన్ సరిగా లేక నీరు కలుషితమవుతున్నాయని.. ఆ నీటిని వాడటం వలన ఆయన చర్మపై దద్దులు వచ్చాయని.. అది అలర్జీగా మారి ఆయనకు నరకం చూపుతోందని అవేదన వ్యక్తం చేసింది భువనేశ్వరి. తన భర్త ప్రాణాలకు జైల్లో అన్నివిధాలుగా ముప్పు ఉందని.. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ఇంకోవైపు ప్రభుత్వం చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. వైద్యం పేరుతో ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.., చంద్రబాబు అందిస్తున్న మందుల చీటిని అధికారులు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. కలుషిత వాటర్.., అపరిశుభ్రమైన వాతారవణం, తగిన భద్రత లేకపోవడంతో చంద్రబాబు ప్రాణాలకే ముప్ప అని వాపోయ్యారు. బాబు అనారోగ్యంపై జైలు అధికారులు చేయిస్తున్న చికిత్సకు సంబంధించిన మెడికల్ ప్రిస్క్రిప్సన్ బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు జైల్లో ఏమైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి జగనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మరోవైపు తెలుగు దేశం సీనియర్లు కూడా పెద్ద ఎత్తున స్సందిస్తున్నారు. సీఎం జగన్ కలిసి బాబు అనారోగ్య పరిస్ధితిని వినతి ద్వారా వివరించాలని ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.