ఏపీలో జగన్ రెడ్డి పాలన బాధ్యతలు చేపట్టిన నాటినుంచి స్థానిక సంస్థల వృద్ధి పతక స్థాయిలో పడిపోయింది. ఈ నాలుగేళ్ళల్లో పంచాయతీలను పట్టించుకున్న పాపాన పోలేదు.రాష్ట్రంలో 2021, ఫిబ్రవరి 5, 17 వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నేటికి సరిగ్గా రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు. నాటి నుంచి నేటి వరకు కేంద్రం విడుదల చేసిన 14,15వ పంచవర్ష ప్రణాళిక సంఘం నిధులు అక్షరాల 8వేల 866 కోట్లును జగన్ రెడ్డి ప్రభుత్వ పక్కదారి పట్టించారు.
2019 నుంచి 2023 వరకు దాదాపు 8 వేల 866 కోట్ల మేరకు నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సర్పంచ్ ల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ పెద్దలు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. పంచాయతీ సర్పంచ్ ల సంతకాలు.., గ్రామ పంచాయతీ తీర్మానం.., గ్రామ సభల ఆమోదాలేమీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను లూటీ చేసిందన్నది కేంద్రానికి మోరపెట్టుకోగా.. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఉప కార్యదర్శి విజయ్ కుమార్ విచారించి.. ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు. ఆ మొన్న ప్రకాశం.., చిత్తూరు జిల్లాలో పంచాయతీల పరిధిలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరాఫరా చేసిన కాంట్రాక్టర్లుకు కోట్లల్లో బిల్లులు ఎగొట్టారని సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.
నమ్మి లక్షల్లో దారపోసి.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ లు ఇప్పుడు అప్పులు పాలై.. రోడ్డున పడ్డారు. ఆనాడు గెలుపుకోసం సర్వశక్తులు.., పెద్ద ఎత్తును డబ్బు ఖర్చు చేసేందుకు పోటీపడ్డ సర్పంచ్ అభ్యర్ధులు .. సర్పంచులైన తరువాత గ్రామాభివృద్ధిలో పోటీ పడలేక పోతున్నారు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్రం పైసా ఇవ్వకపోయినా.. కనీసం కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా పక్కదారి పట్టించడం దౌర్బాగ్యం. దీంతో పంచాయతీలో కనీసం విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్ధితి. డ్రైనేజీలు.., రోడ్ల బాగుకు కనీసం చేతిలో చిల్లిగవ్వలేని స్ధితి. సొంత డబ్బుతో చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు కానీ పరిస్ధితి. కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో ఏం సమాధానం చెప్పలో తెలియక గ్రామాలు వదిలివెళ్లిన పరిస్ధితులు ఎన్నో.
ఇలా పచ్చని పల్లె ప్రగతిని ఎటువంటి అభివృద్ధి లేక ఒట్టిపోయేలా చేసిన ఘనుడు జగన్ రెడ్డి. అందుకే సర్పంచ్ లు బాధ్యతలు నిర్వర్తించలేక ఎందరో రాజీనామాలు చేశారు. ఇంకా చేస్తున్నారు కూడా. పంచ వర్ష ప్రణాళిక నిధులు పక్కదారి పట్టించారని సాక్ష్యాలతో తెలుపుతూ.. జగన్ సొంత జిల్లా కడప.. కాజీపేట మండలంలో ఏకంగా 13మంది సర్పంచ్ లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి విధితమే.