ఉత్తాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో పేదోడి ఆరోగ్యం అగమ్యగోచరంగా మారితే.. రవాణా సౌకర్యం ఉన్న నగరాలు.., పట్టణాలు.., పల్లెల్లో కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం అత్యంత దారుణంగా దిగజారుతోంది. నాలుగేళ్లలో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాల భారీన పడి వైద్యం అందక ఎన్నో చావులను రాష్ట్ర ప్రజలు చూశారు. వైద్య సదుపాయాల కోసం రోగులను, గర్బిణి స్త్రీలను డోలీలలో మోసుకొస్తున్న దృశ్యాలు నేటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన కుటుంబ సభ్యులను, బంధువులను అంబులెన్స్ లు అందుబాటులో లేక ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన ఘటనలు నేటి చూస్తునే ఉన్నాం.
ఇదే తరుహా సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో మరోసారి రిపిట్ అయ్యింది. తన 5 సంవత్సరాల కొడుకు జ్వరంతో ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిగా.. అంబులెన్స్ సౌకర్యం లేక ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు తండ్రీ. అమరాపురం మండలం.., హనుమంతనపల్లి గ్రామానికి చెందిన పాతలింగప్ప ఐదు సంవత్సరాల కుమారుడు రుషి విష జ్వరంతో మృతి చెందాడు. ఆసుపత్రి సిబ్బందిని అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరగా.. వారు దానికి నిరాకరించారు. ఇతర వాహనాల్లో బాలుడి మృతదేహాన్ని గ్రామానికి తరలించాలంటే డబ్బులు లేక తన సొంత ద్విచక్రవాహనంపై కూర్చోపెట్టుకుని తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్తున్న సమయంలో తల్లిదండ్రులు రోధనలు కంటతడి పెట్టించాయి. హృదయం ద్రవించేలా బిడ్డ శవాన్ని బైక్ పై ఉంచి తరలిస్తున్న దృశ్యం వర్ణానతీతం. ఇవే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జగనన్న సురక్ష పేరుతో పేదోడి ఇంటి వద్దకే వైద్యం పేరుతో కలరింగ్ ఇస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవి కనిపించడం లేదా..? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలతోపాటు నగరాల్లో విషజ్వరాలు విజృంబిస్తున్నాయి. వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని జగన్ రెడ్డి ప్రభుత్వం.. ఆరోగ్యం, వైద్యం పై కనీస శ్రద్ధ చూపడం లేదన్నది వాస్తవం. డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు దోమల వ్యాప్తికి దారితీస్తుంటే.. నిత్యం ప్రజలు రోగాలు భారీన పడుతున్నారు. ఈ నాలుగునరేళ్ళ పాలనలో ప్రజలు విషజ్వరాల భారీన పడి ఆర్ధికంగా ఎంతో చితికిపోయారు. ప్రాణాలను సైతం హరిస్తున్న జర్వాలపై దృష్టిసారించకుండా పథకాల ప్రచారంలో జగన్ రెడ్డి చేస్తున్న ఆర్బాటం చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.