APలో నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏకంగా 20 శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. మొత్తం 892 పోస్టులను భర్తీ చేయనుండగా.. అందుకు కావలసిన అర్హతలు, వివరాలను వెబ్ సైట్ లో ఉంచింది. అర్హత గల అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
గ్రూప్-1లో 163 పోస్టుల భర్తీ –
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 18 ఎనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు, 1 అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్, 12 ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, 17 అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టులు ఉన్నాయి. అలాగే 73 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2, 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఏపీ అసెంబ్లీలో 11 ఇంగ్లీష్, తెలుగు రిపోర్టర్లు, 17 అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ట్రైబుల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, 8 అసిస్టెంట్ డైరెక్టర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సర్వీసెస్, 37 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కానున్నాయి.
మొత్తం 163 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కాగా, అక్టోబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. ఇందులో 11 డిప్యూటీ కలెక్టర్లు, 14 ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు, 36 డీఎస్పీ సివిల్, 3 DSP కమ్యూనికేషన్స్ పోస్టులు, 14 డీఈవోలు, 1 ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, 3 RTOలు, 15 డిప్యూటీ రిజిస్టర్ కోఆపరేటివ్ సర్వీసెస్ పోస్టులు, 12 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, 2 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, 3 డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, 14 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, 35 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
నిరుద్యోగ యువతలో గందరగోళం రేకెత్తించేందుకు వైసీపీ అడుగుగడుగునా కుట్రలు, అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్మెంట్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. వరుస నోటిఫికేషన్ల ప్రకటనతో నిరుద్యోగ యువతలో జోష్ నింపుతోంది.











