స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కు రీవెంజ్ మొదలైంది. జగన్ ప్రభుత్వంపై కౌంటర్ కేసులకు సామాన్యులు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఐడీ చీఫ్ సంజయ్.., పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై హైకోర్టులో ఎన్జీవో సత్యనారయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. స్కిల్ కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు ప్రజా ధనంతో ప్రెస్ మీట్ పెట్టి కేసును మీడియాకు వివరించా రని.. ఇది చట్టాలను ఉల్లంఘించడమేనని ఏపీ హైకోర్టులో ఎన్జీవో సత్యనారాయణ పిటిషన్ ద్వారా కోర్టులో నిలదీశారు. దీనిపై హైకోర్టు స్పందించి.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ జగన్ పై యుద్ధం ప్రకటించారు. జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాడు రఘురామ. తెలంగాణ సీబీఐ కోర్టులో 12 ఏళ్ళుగా వాయిదాల పర్వం నడుస్తోందని.. ఈ కేసును మరో రాష్ట్రానికి మారిస్తే విచారణ వేగవంతమవుతోందని రఘురామ పిటిషన్ లో స్పష్టం చేశారు. దీనిపై సుప్రీం స్పందించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా.., జస్టిస్ భట్టిలు ఈ పిటిషన్ ను విచారించనున్నారు.
ఇంకోవైపు ఏపీ హైకోర్టులో జగన్ పై గురువారం ప్రజా వ్యాజ్యం వేశారు రఘురామ. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ.. హై కోర్టులో ప్రజా వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రజాధన నష్టం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని పిల్ లో ఆయన పేర్కొన్నారు. సాక్షి పత్రిక, ఛానెల్ కు లబ్ధి కలిగేలా సీఎం నిర్ణయాలు తీసుకున్నారని, అలానే వివిధ శాఖలో జరిగిన అవినీతిపై డిటైల్ గా పిల్ ప్రస్తావించారు.