మాచర్ల నియోజకవర్గం దౌర్జన్యాల రాజకీయాలకు అడ్డా. రౌడీ రాజకీయానికి కేరాఫ్. ఇక్కడ రెండు దశాబ్ధాలుగా రాజకీయాలు నిత్యం వేడిక్కుతునే ఉన్నాయి. ఈ వేడి అనునిత్యం హత్యాకాండతోనే చల్లారుతూ.. తిరిగి అధికార మదంతో వేడెక్కుతూనే ఉంటుంది. మాచర్ల ను కంటి సైగతో రౌడీ మూకలను ఎగదోసే నీచ సంస్కృతి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.., ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలది. ఇది ప్రజల్లో ఎప్పటి నుంచో బలంగా నాటుకుపోయి ఉన్న అంశం కూడా. వీరి దౌర్జన్యకాండను ఎదిరించినా.., ప్రశ్నించినా.. ఆ నెక్స్ట్ డే వారు జైలు లేదా చావును పరిచయం చేసుకోవడం సర్వసాధారణమే. ఇందుకు నియోజకవర్గంలో అనేక సాక్ష్యాలు తారసపడుతూనే ఉంటాయి.
ఈ నేపధ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ తోపాటు వీరి అనుచరుడు తురక కిషోర్ ఆగడాలను భరించలేకపోతున్నామని మాచర్ల బస్టాండ్ సెంటర్లో వైసీపీ నేత ఆత్మహత్య యత్నం చేశాడు. తన బైక్ పై పెట్రోలు పోసి తగలపెట్టి నిరసనకు దిగారు. తాను ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నమ్ముకుని కుటుంబతో సహ రోడ్డున పడ్డామని ఆయన అనుచరుడు మల్లెల గోపి(డీజే) అవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ తో తన వాహనాన్న తగలపెట్టుకోవడమే కాక.., తాను కూడా అదే పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడపోగా.. పోలీసులు ఆయనను ఆపి.., అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ను నమ్ముకుని మోసపోయానని.. తనలాగే ఎవరు బలికావద్దు అని కన్నీరు పెట్టుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో తనలాగే అనేక మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు బాధితులుగా ఉన్నారని .. బయటపెడితే సొంత పార్టీ నేతలని చూడకుండా బెదింరించి.. కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.
మల్లెల గోపి ఘటనతో అధికార వైసీపీ కేడర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎమ్మెల్యే పిన్నెల్లి క్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఈ సంఘటనపై సొంత పార్టీలో పెద్దలను సైతం కలవరం పెడుతోంది. విజయ దశమి నాడు దేశం మొత్తం దశ కంఠుడి దహనం చేస్తే.. ఈ రోజు మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ సాగిస్తున్న రాక్షస కాండకు విసిరి సొంత పార్టీ నేతే తన బైక్ ను తగలపెట్టుకుని నిరసన వ్యక్తం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఇది ప్రజల్లోనే కాదు అధికార వైసీపీ నేతల నుంచే పుట్టుకొస్తున్న మార్పుగా అభివర్ణించాల్సి ఉంటుంది. అసుర పిన్నెల్లి దహనం జరిగితేనే.. మాచర్ల సర్వతోముఖంగా శాంతి చేకూరిద్దని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.