తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని బిగ్ బాస్ షోని ‘స్టార్ మా’ 2017లో స్టార్ట్ చేసింది. మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్యాలెంట్ తో ఈ షోని తెలుగు రాష్ట్రాలకు చేరువ చేశారు. ఆ తరువాత నాని, నాగార్జున కూడా ఈ షోని ఆసక్తికరంగా నడిపారు. రియాలిటీ షోని తెలుగు ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకోవడంతో నాలుగో సీజన్ కోసం స్టార్ మా ప్లాన్ చేసింది. హోస్ట్ గా నాగార్జుననే కొనసాగిస్తూ వివిధరంగాలకు చెందిన వారిని కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు. భారీ అంచనాల మధ్య మొదలైన ఈ సీజన్ మొదటి వారంలోనే మంచి ఆదరణ దక్కించుకుంది. సోషల్ మీడియా సెన్సేషన్ ‘గంగవ్వ’ని హౌస్ లోకి పంపడంతో ఈ షోపై ఆసక్తి పెరిగిపోయింది.
ఎలిమినేషన్స్
తొలి వారంలోనే ఈ షో నుంచి దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీగా ‘ఈ రోజుల్లో’ ఫేమ్ కుమార్ సాయిను పంపారు. సినిమాలలో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సాయి హౌస్ లో తేలిపోయాడు. దీంతో నాగార్జున కూడా ఆయనపై సైటర్లు వేశారు. ఈ సీజన్ ను విజయవంతంగా నడిపేందుకు బిగ్ బాస్ వివిద టాస్క్ లను ఇచ్చారు. దీంతో నటి మోనాల్ గుజ్జర్ తో అభిజిత్, అఖిల్ లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసింది. రెండవ వారంలో ప్రేక్షకులను అంతగా అలరించకపోవడంతో నటి ‘కరాటే’ కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. షోకి అదనపు హంగులు అద్దడానికి ‘జబర్దస్త్’ ఫేమ్ అవినాష్ ను హౌస్ లోకి పంపారు.
తాను ‘జోకర్’ ను అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇదే సమయంలో నటి మోనాల్ గుజ్జర్ తో పులిహోర కలుపుతున్నారు. దీంతో ప్రేక్షకులకు ఈ షో పట్ల ఆసక్తి పెరిగింది. మూడవ వారంలోకి అడుగుపెట్టడంతో బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఈ వారం నామినేషన్స్ లో దేవి నాగవల్లి, లాస్య, మోనాల్ గుజ్జర్, కుమార్ సాయి, అరియనా, హారిక, మెహబూబ్ ఉన్నారు.
ఓటింగ్ ఫలితాలు
లాస్య, మోనాల్, అరియనాలు నామినేషన్స్ లో ఉండటంతో ఈ వారం ఎవరు? ఎలిమినేట్ కానున్నారని ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నామినేషన్స్ లో ఉన్న వారికి నమోదయిన ఓటింగ్ ఫలితాలు బయటికి వచ్చాయి. ఆ సర్వే ఫలితాల ప్రకారం లాస్య అగ్రస్థానంలో ఉంది. లాస్యకు 18 శాతం ఓటింగ్ రాగా, మోనాల్ కు 17 శాతం వచ్చింది. అరియనా 14 శాతంతో మూడవ స్థానంలో ఉన్నారు. కుమార్ సాయి, హరిక, మెహబూబ్ లు సేఫ్ జోన్ లో ఉండగా దేవి 10 శాతం ఓటింగ్ తో చివరి స్థానంలో ఉన్నారు. ‘టీవీ 9’ దేవి డేంజర్ జోన్ లో ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇంకా రెండు రోజుల సమయం ఉండటంతో దేవి ఓటింగ్ శాతం పెరగవచ్చు. కానీ ఇప్పటివరకున్న సమాచారం మేరకు దేవి హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగకతప్పదు!!











