టాలీవుడ్ లో నాలుగే నాలుగు సినిమాలతో సెన్సేషనల్ హీరో అయిపోయాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. యూత్ ఫుల్ మూవీస్ తో.. తన యాటిట్యూడ్ తో అత్యధిక సంఖ్యలో అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. అర్జున్, రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకోగా.. గీత గోవిందం సూపర్ హిట్ తో 100కోట్ల క్లబ్ లోకి చేరుకున్నాడు. ఇక డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ మూవీస్ తో పరాజయాలు ఎదుర్కొన్నా .. అతడి మార్కెట్ కు ఎలాంటి ఢోకా లేదు.. పైపెచ్చు.. అతడి సినిమాలు తీయడానికి బాలీవుడ్ మేకర్స్ సిద్ధమవుతున్నారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘ఫైటర్’ సినిమాను కరణ్ జోహార్ బాలీవుడ్ లో విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మన రౌడీ హీరోకి బాలీవుడ్ నుంచి ఓ అరుదైన అవకాశం రావడం హాట్ టాపిక్ అయింది. నిజానికి విజయ్ దేవరకొండ రొమాంటిక్ హీరో కాబట్టి.. అతడికి అన్నీ ఎక్కువగా అలాంటి జోనర్స్ లోనే అవకాశాలు రావాలి. కానీ.. అతడితో ఓ వార్ మూవీ తీయాలని ఓ బాలీవుడ్ మేకర్ కు ఆలోచన రావడం ఆసక్తిని కలిగిస్తోంది. 2019 లో బాలాకోట్ వైమానిక దాడి ఆధారంగా.. ఓ సినిమా తీయాలని బాలీవుడ్ దర్శకుడు అభిషేక్ కపూర్ ప్రయత్నిస్తున్నాడు.
ఆయనతో పాటు సంజయ్ లీలా భన్సాలి, టీసిరిస్ భూషణ్ నిర్మాణ భాగస్వామ్యులు అవుతున్నారు. పాకిస్థాన్ ముష్కరులు సాగించిన పుల్వామా దాడి అనంతరం.. భారత్ సైన్యం బాలాకోట్ వైమానిక దాడి చేసింది. ఈ దాడి సమయంలోనే భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ .. పాక్ సైన్యానికి పట్టుపడ్డారు. కొద్దిరోజుల సాహసోపేతమైన జర్నీ తర్వాత అభినందన్ ను పాక్ సైన్యం విడుదల చేసింది. యురి అటాక్ ను సర్జికల్ స్ట్రైక్ అన్నారు. ఆ సంఘటనపై బాలీవుడ్ లో తీసిన సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు .. ఆ తర్వాత బాలాకోట్ లో జరిగిన దాడిని ఇప్పుడు సెల్యులాయిడ్ కు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు అభిషేక్ కపూర్.
ఇప్పుడు ఈ సినిమా కోసం మేకర్స్ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను హీరోగా ఫైనల్ చేయడం టాలీవుడ్ లో చర్చకు దారి తీసింది. ఇందులో విజయ్ దేవరకొండ అభినందన్ పాత్ర పోషించనుండడం మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఈ సినిమా ప్రధానంగా పుల్వామా దాడి, బాలాకోట్ వైమానిక దాడి నేపథ్యంలో .. అభినందన్ పాక్ కు పట్టుబడి, చివరికి విడుదలయ్యే వరకూ సాగిన ఎమోషనల్ జెర్నీ మీద తెరకెక్కనుందట. విజయ్ దేవరకొండకి ఈ సినిమా స్ర్కిప్ట్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం అభిషేక్ కపూర్ ఆయుష్మాన్ ఖురానా, వాణీకపూర్ లతో ఒక సినిమా చేస్తున్నాడు .అది కంప్లీట్ కాగానే… ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. మరి విజయ్ దేవరకొండకి బాలీవుడ్ తెరంగేట్రం ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.











